ధనలక్ష్మీ యోగం.. ఈ రాశులవారికి సంపద వర్షం!!
ధనలక్ష్మి యోగం.. ఇది అత్యంత అద్భుతమైన ఖగోళ సంఘటన. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో ఒక్కో గ్రహం ఒక్కో సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని యోగాలు ఏర్పడతాయి. కొన్ని అశుభ యోగాలు కాగా కొన్ని శుభ యోగాలు. ఇక శుభ యోగాలలో ఒక యోగం ధనలక్ష్మి యోగమని చెప్పబడింది.
గురువారం నాడు బృహస్పతి గ్రహం తో అనుబంధించబడిన రోజున ధనలక్ష్మీ యోగం ఏర్పడుతుంది. సానుకూలమైన ప్రభావాలను చూపించే రెండు గ్రహాలు ఒకే మార్గంలో సంచరిస్తున్నప్పుడు ధనలక్ష్మి యోగం ఏర్పడుతుంది. జ్ఞానానికి , శ్రేయస్సుకి ప్రతీకగా భావించే బృహస్పతి, శక్తికి, కాంతివంతమైన జీవితానికి మూలమైన సూర్యదేవుడు ఒకే మార్గంలో ఉన్నప్పుడు, ఈ శక్తివంతమైన ఖగోళ అంశాలు సమలేఖనం అయినప్పుడు ధనలక్ష్మి యోగ ఏర్పడుతుంది.

బృహస్పతి మరియు సూర్యుడు ఒకే చోట కలిసినప్పుడు వారి పాజిటివ్ శక్తి వివిధ రాశుల వారికి మంచి చేస్తుంది. ధనలక్ష్మి యోగం వల్ల మేష రాశి వారి జీవితంలో ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఆర్థికంగా వీరు మెరుగుదలను చూస్తారు. వృత్తిపరమైన కార్యకలాపాలలో వీరు విజయాన్ని సాధిస్తారు. ధనలక్ష్మి యోగం వల్ల మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయవంతం అవుతారు. సంపద లభిస్తుంది.
ధనలక్ష్మి యోగం వల్ల సింహ రాశి వారికి లబ్ధి చేకూరుతుంది. సింహ రాశి వారు కెరీర్లో పురోగతిని సంపాదిస్తారు. పనిచేసే చోట గుర్తింపును పొందే అవకాశం వస్తుంది. ఈ సమయంలో వీరి కీర్తి ప్రతిష్టలు ప్రకాశిస్తాయి. ధనలక్ష్మి యోగం వల్ల ధనుస్సు రాశి వారికి లబ్ధి చేకూరుతుంది. ధనస్సు రాశి వారు వారి పరిధిలో విస్తరించడానికి, ఉత్తేజకరమైన ప్రయాణాలను ప్రారంభించే అవకాశాలను ధనలక్ష్మి యోగం తీసుకువస్తుంది.
ఇక మీన రాశి వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. ధనలక్ష్మి యోగం వల్ల వారిలో ఉన్న అంతర్దృష్టి, సృజనాత్మకత మరింత పెరుగుతుంది. ఇది వారి జీవితాల్లోని వివిధ అంశాలలో ప్రయోజనకరంగా మారుతుంది. ధనలక్ష్మీ యోగం ఈ నాలుగు రాశులకు శుభాలను కలిగిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications