ధన త్రయోదశి నాడు అద్భుత శుభయోగం.. 5రాశుల వారికి పంట పండినట్టే!!

ధన త్రయోదశి పండుగ రోజు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు. ఈ సంవత్సరం ధన త్రయోదశి నవంబర్ 10వ తేదీన జరుపుకుంటున్నాము. అయితే ధన త్రయోదశి పర్వదినం నాడు శుక్రుడు కన్యారాశిలో ఉండడంతో పాటు, చంద్రుడు కూడా కన్యారాశిలో ఉంటాడు. ధన త్రయోదశి నాడు కన్యారాశిలో శుక్రుడు చంద్రుడు కలయిక వల్ల శుక్ర శశి యోగం ఏర్పడుతుంది.

ఈ యోగం ఏర్పడడం వల్ల ముఖ్యంగా ఐదు రాశుల వారిపై సానుకూల ప్రభావం పడుతుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.వృషభ రాశి వారికి శుభాలను కలిగిస్తుంది. వృషభ రాశి వారికి ఈ సమయంలో అపరిమిత మొత్తంలో సంపద లభిస్తుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఈ సమయంలో పొందుతారు. ఉద్యోగ జీవితంలో ఆశ్చర్యానికి గురి అయ్యే మార్పులు సంభవించవచ్చు. ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి లభిస్తుంది.

Dhana Trayodashi dhanteras gives good luck to 5 zodiac signs

ధన త్రయోదశి నాడు శుభయోగం ఏర్పడడం వల్ల కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. సొంత వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసినా కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో లాభాలను ఆర్జించవచ్చు.

కన్యా రాశి వారికి ధన త్రయోదశి రోజు ఏర్పడే శుభయోగం బాగా కలిసి వస్తుంది. అపారమైన సంపదను, శ్రేయస్సును ఈ సమయంలో పొందుతారు. ఉద్యోగస్తుల జీతాలు పెరుగుతాయి. ప్రమోషన్లకు ఇది ఉత్తమ సమయం. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లాలని ఆసక్తి ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి మన్ననలు పొందుతారు.

తులా రాశి వారికి ధన త్రయోదశి బాగా కలిసొస్తుంది. మీకు రావలసిన డబ్బు ఈ సమయంలో తిరిగి వస్తుంది. వర్తక వ్యాపారాలలో ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే వారికి భవిష్యత్తులో భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ను ఇది చాలా శుభ యోగంగా చెప్పబడింది.

ధన త్రయోదశి నాడు మకర రాశి వారికి అన్ని విధాల లబ్ధి చేకూరుతుంది. వారు పెద్ద మొత్తంలో లాభాలను కూడ బెట్టుకునే అవకాశం ఉంది. మకర రాశి వారికి ఈ సమయంలో విపరీతమైన ఖ్యాతి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మకర రాశి వారిపై లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ఇది సరైన సమయం. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+