ధనశక్తి రాజయోగం: ఈ నెలలో మూడు రాశులవారికి సంపద వర్షం!!

మార్చి నెలలో ధనశక్తి రాజయోగం ఏర్పడనుంది, ఈ నెలలో కుజుడు, శుక్రుడు ఒకే రాశిలో సంయోగం చెందబోతున్నాయి. ఈ శుక్ర, కుజ గ్రహాల సంయోగం కారణంగా ధనశక్తి రాజయోగం ఏర్పడుతుంది. మార్చి 7 వ తేదీన శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మార్చి 15న కుజుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభరాశిలో శుక్ర, కుజ గ్రహాల కలయిక వలన ధనశక్తి రాజయోగం ఏర్పడుతుంది.

ధనశక్తి రాజయోగం మూడు రాశుల వారికి చాలా లబ్ధిని చేకూరుస్తుంది. ముఖ్యంగా మేషరాశి, కుంభరాశి, మిధునరాశి జాతకులకు ధనశక్తి రాజయోగం లాభిస్తుంది. మేషరాశి జాతకులకు ధన శక్తి రాజయోగం బాగా కలిసొస్తుంది. వారు ఈ సమయంలో జీవితంలో అనేక విజయాలను సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసేవారు ఆర్ధిక పురోగతిని సాధిస్తారు. ఆర్థిక స్థిరత్వం వస్తుంది.

Dhanshakti Rajyoga This yoga will bring wealth to the three zodiac signs in march

ఈ సమయంలో మేషరాశి జాతకులు పెట్టిన వ్యాపార పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ఆర్థిక వనరులు బాగా పెరుగుతాయి. పూర్వీకుల నుండి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. ఆర్ధికంగా మేషరాశి వారికి ఇది మంచి కాలం.

ధనశక్తి రాజయోగంతో కుంభ రాశి జాతకులకు కలిసొస్తుంది. కుంభరాశి జాతకులు జీవితంలోని అన్ని రంగాల్లో విశేషమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వీరు ఏ పని చేసినా అదృష్టం కలిసొస్తుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఈ రాశి వారిపై ఎప్పుడూ ఉంటాయి. ధనశక్తి రాజయోగం కారణంగా ఈ రాశి జాతకులు ఎక్కువ డబ్బును సంపాదించగలరు. అలాగే పని చేసేచోట ప్రమోషన్లకు ఆస్కారం ఉంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. భారీ ప్రాజెక్టులు వస్తాయి.

ధనశక్తి రాజయోగం కారణంగా మిధునరాశి జాతకులకు లబ్ది జరుగుతుంది. మిధున రాశి జాతకులు తమ శుభయోగాల కారణంగా మంచి ఫలితాలను సాధిస్తారు. వీరి ఆదాయ స్థాయిలు ఈ సమయంలో గణనీయంగా పెరుగుతాయి. స్థానికులకు భారీ లాభాలు ఉంటాయి.
వారు తమ ఖర్చులను బాగా నిర్వహించగలుగుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతే కాకుండా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+