ధన త్రయోదశి నాడు ఈ పని చేస్తే ఏడాది పొడుగునా డబ్బే డబ్బు!!
హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ ధన త్రయోదశి. దీపావళి పండుగకు ముందు జరుపుకునే ఈ పండుగ రోజు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజుగా చెబుతారు. ధన త్రయోదశి పండుగ దేశవ్యాప్తంగా రేపు జరుపుకోనున్నారు.దీపావళి పండుగను సహజంగా ధన త్రయోదశి పర్వదినంతోనే ప్రారంభిస్తారు.
ఈ సంవత్సరం ధన త్రయోదశి తిథి నవంబర్ 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ప్రారంభమై, నవంబర్ 11వ తేదీ మరుసటి రోజు మధ్యాహ్నం 1. 57 నిమిషాలకు ముగుస్తుంది. ధన త్రయోదశి పండుగ రోజున కుబేరుడిని, ధన్వంతరిని విశేషంగా పూజిస్తారు. అయితే ధన త్రయోదశి పండుగ రోజున ఒక పని చేస్తే సంవత్సరం అంతా ఇంట్లో డబ్బు ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.

ధన త్రయోదశి పండుగ రోజున దీపారాధన ఎన్నో శుభాలను కలిగిస్తుందని చెబుతున్నారు. ఇంట్లో దీపాలను వెలిగిస్తే అమోఘమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.ధన త్రయోదశి పండుగ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలని, ఈ దీపం ఇంట్లోకి లక్ష్మీదేవిని స్వాగతిస్తుంది అని చెబుతున్నారు. ఇంట్లోని శాంతిని కాపాడుతుందని, సంపద వర్షం కురిసేలా చేస్తుందని చెబుతున్నారు.
ధన త్రయోదశి రోజున పూజ గదిలో దీపాన్ని వెలిగించడం వల్ల కుటుంబానికి వర్షం కురుస్తుందని చెబుతున్నారు. పూజ గదిలో దీపాన్ని వెలిగించడం ఇంట్లో ఆనందాన్ని తీసుకువస్తుందని చెబుతున్నారు. వ్యాపార స్థలంలో ధన త్రయోదశి రోజున దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందని, పారిశ్రామిక ప్రాంతాలు, దుకాణాల్లో కూడా దీపాలు వెలిగించాలి.
వ్యాపారంలో అభివృద్ధి కోసం లక్ష్మీ దేవి ఆశీర్వాదం పొందడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే ధన త్రయోదశి పర్వదినం సకల శుభాలను ఇస్తుందని చెప్తున్నారు. కాబట్టి ధన త్రయోదశి నాడు దీపాలు వెలిగించండి. నిర్దిష్టమైన స్థలాలలో దీపాలు వెలిగిస్తే కచ్చితంగా సంపద వర్షం కురుస్తుందని చెప్తున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications