Dhanteras 2023: ధన త్రయోదశి నాడు చీపురును కొనటం నిజంగా మంచిదేనా?
హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ ధన త్రయోదశి. దీపావళి పండుగకు ముందు జరుపుకునే ఈ పండుగ రోజు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజుగా చెబుతారు. దీపావళి పండుగను సహజంగా ధన త్రయోదశి పర్వదినం తోనే ప్రారంభిస్తారు. అటువంటి ధన త్రయోదశి పండుగ ఈ సంవత్సరం నవంబర్ 10వ తేదీన జరుపుకోనున్నారు.
ఈ సంవత్సరం ధన త్రయోదశి తిథి నవంబర్ 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ప్రారంభమై, నవంబర్ 11వ తేదీ మరుసటి రోజు మధ్యాహ్నం 1. 57 నిమిషాలకు ముగుస్తుంది.ధన త్రయోదశి పండుగ రోజున కుబేరుడిని, ధన్వంతరిని విశేషంగా పూజిస్తారు.

అయితే ఈ రోజు చాలామంది బంగారం, వెండి, వాహనాలు, పాత్రలు ఇలా కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఒక గ్రాము బంగారమైనా కొనుగోలు చేయాలని మహిళలు భావిస్తారు. ఈరోజు వస్తువులను కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు తమపై ఉంటాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు.
మత విశ్వాసాల ప్రకారం ధన త్రయోదశి రోజున చీపురు కొనడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. చాలా పురాతన కాలం నుంచి ధన త్రయోదశి రోజు చీపురును కొనడం ఆనవాయితీగా వస్తుంది. ధన త్రయోదశినాడు చీపురును కొనడం వల్ల లక్ష్మీదేవి యొక్క విశేషమైన ఆశీస్సులు లభిస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు.
ధన త్రయోదశి నాడు ఇంటికి చీపురు తీసుకురావడం వల్ల ఆర్థిక లాభాలు కలగడం మాత్రమే కాకుండా, ఇంటికి ఆనందం మరియు శాంతి కలుగుతుందని చెబుతారు. మత్స్య పురాణం ప్రకారం చీపురును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ధన త్రయోదశి రోజు ఎవరైతే చీపురును కొనుగోలు చేస్తారో వారు ఆర్దిక ఇబ్బందుల నుండి గట్టెక్కుతారని నమ్ముతారు.
ధన త్రయోదశి నాడు చీపురును కొనుగోలు చేసిన వారు లక్ష్మీదేవి మరియు కుబేరునితో పాటు చీపురును కూడా పూజించాలని చెబుతున్నారు. అంతేకాదు ధన త్రయోదశి నాడు దానాలు చేసినా పుణ్యమే అంటున్నారు. ధన త్రయోదశి నాడు దాన ధర్మాలు చేస్తే సిరి సంపదలు కలుగుతాయని, మనం దానం చేసిన దానికి పదింతలు మనకు లబ్ది జరుగుతుందని చెప్తున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications