ధన త్రయోదశి నాడు ఈ పనులతో ఏడాదంతా సంపదల వర్షం!
దీపావళికి ముందు ధన త్రయోదశిని విశేషంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్టోబర్ 29వ తేదీన మంగళవారం నాడు ధన త్రయోదశి జరుపుకోనున్నారు. అయితే ధన త్రయోదశి పండుగ అనగానే ఎంతో విలువైన బంగారు, వెండి ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇంట్లో కొత్త వస్తువులను కొనుగోలు చేసుకుంటారు .అనాదిగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది.
ధన త్రయోదశి నాడు ఈ పనులు చేస్తే సంపద వర్షం
ధన త్రయోదశి తర్వాతనే అత్యంత ఇష్టంగా భావించే దీపావళి పండుగను జరుపుకుంటారు. ధన త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ వినాయకుడిని, కుబేరుడిని పూజిస్తారు. లక్ష్మీదేవికి కూడా పూజలు చేస్తారు. ధన త్రయోదశి పండుగ రోజు కొన్ని పనులు చేస్తే, కొన్ని వస్తువులను కొనుగోలు చేసే ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరమంతా సంపద వృద్ధి చెందుతుందని నమ్ముతారు.

ధన త్రయోదశి నాడు ఇలా చేస్తే మంచిది
ధన త్రయోదశి రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే గోధుమలను పసుపు వస్త్రంలో కట్టి భద్రంగా పెట్టుకోవాలి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ధన త్రయోదశి రోజు అమ్మవారికి ఇష్టమైన తామర పూలమాలను సమర్పిస్తే, అందునా 108తామరపువ్వుల మాలను సమర్పిస్తే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ధన త్రయోదశి రోజు తులసి మొక్కను పూజిస్తే, తులసి మొక్క ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది.
ధన త్రయోదశి నాడు చీపురు కొంటే జరిగేదిదే
అత్యంత పవిత్రమైన ధన త్రయోదశి రోజు చీపురును కొనుగోలు చేసినా, మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు చీపురుని దానం చేసిన లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చెబుతారు. ధన త్రయోదశి పండుగ రోజున దీపారాధన ఎన్నో శుభాలను కలిగిస్తుందని చెబుతారు. ఇంట్లో దీపాలను వెలిగిస్తే అమోఘమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు. ధన త్రయోదశి పండుగ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగిస్తే మంచిది.
దీపం వెలిగిస్తే మంచి ఫలితం
ఈ దీపం ఇంట్లోకి లక్ష్మీదేవిని స్వాగతిస్తుంది అని చెబుతారు. ఇంట్లోని శాంతిని కాపాడుతుందని, సంపద వర్షం కురిసేలా చేస్తుందని చెబుతారు. ధన త్రయోదశి రోజున పూజ గదిలో దీపాన్ని వెలిగించడం వల్ల కుటుంబానికి సంపదల వర్షం కురుస్తుందని చెబుతున్నారు. పూజ గదిలో దీపాన్ని వెలిగించడం ఇంట్లో ఆనందాన్ని తీసుకువస్తుందని చెబుతున్నారు. వ్యాపార స్థలంలో ధన త్రయోదశి రోజున దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందని, దుకాణాల్లో కూడా దీపాలు వెలిగించుకుంటే మంచిదని అంటున్నారు. .
disclaimer: ఈ కథనం వాస్తు జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications