ధన త్రయోదశి.. ఈరోజు సాయంత్రం పూజ ఇలా చేస్తే డబ్బుకు లోటుండదు!!
ఈరోజు ధన త్రయోదశి పండుగ. ధన త్రయోదశిని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ షాపింగ్ లో మునిగి తేలుతున్నారు. దీపావళికి రెండు రోజుల ముందు వచ్చే నీ వేడుకను అత్యంత ఘనంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ధన త్రయోదశి రోజు ఆయుర్వేద దేవుడైన ధన్వంతరిని, సంపదలకు అధిపతి అయిన కుబేరుడిని, విశేషంగా పూజిస్తారు.
ధన త్రయోదశి రోజున ఇంటికి బంగారాన్ని, వెండిని కొనుగోలు చేసి తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుందని చాలామంది నమ్ముతారు. ఇదిలా ఉంటే ఈరోజు ధన త్రయోదశి, అందునా శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు ధన త్రయోదశి పూజ చాలా ప్రత్యేకమైందని చెప్పాలి. పూజ ముహూర్తాన్ని 5 గంటల 48 నిమిషాల 50సెకండ్ల నుండి 7గంటల 44నిమిషాల 43సెకండ్ల వరకు చేసుకోవచ్చని పండితులు చెప్తున్నారు.

ధన త్రయోదశి నవంబర్ 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ప్రారంభమై రేపు మధ్యాహ్నం 1. 57 నిమిషాల వరకు ఉంటుంది. ఇక ధన త్రయోదశి రోజున పూజలు చేసేవారు పూజ విషయంలో జాగ్రత్తలు పాటించాలి.పూజ విషయంలో నిష్టగా నియమానుసారం పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చెబుతారు.
ధన త్రయోదశి రోజున నిర్ణయించిన శుభముహూర్తంలో వినాయకుడిని, కుబేరుడిని, లక్ష్మీదేవిని, ధన్వంతరిని పూజించాలి. పూజ గదిలో వారి విగ్రహాలను లేదా ఫోటోలను ఉంచి పూజ చేయాలి. దేవతలందరికీ పూలు పండ్లు స్వీట్లు మొదలైన వాటిని సమర్పించి దీపం వెలిగించి, ఆ తర్వాత మీ కోరికలను దేవతలకు తెలియజేయాలి.
అత్యంత భక్తి భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. హారతి ఇచ్చి , తెలిసో తెలియకో చేసిన తప్పులకు భగవంతుని ముందు పశ్చాత్తాపాన్ని ప్రకటించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది.ధన త్రయోదశి రోజున శ్రీ యంత్రాన్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ దేవి కటాక్షం తప్పనిసరిగా ఉంటుందని చెప్పొచ్చు. ఈరోజు బంగారం , వెండి నాణాలను కొనుగోలు చేస్తే మంచిది. లక్ష్మీ దేవి, వినాయక విగ్రహాలను కొనుగోలు చేస్తే కూడా మంచి జరుగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications