కాలాష్టమి నాడు ధృవయోగం.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారం!
ఫిబ్రవరి 20వ తేదీన కాలాష్టమి పండుగను జరుపుకుంటున్నాము. కాలాష్టమి రోజు కాలభైరవుని ఆరాధనకు అంకితం చేసే రోజు, కాబట్టి ఈ కాలాష్టమి నాడు గ్రహాల సంచారం కారణంగా ధృవ యోగం ఏర్పడుతుంది. అష్టమి తిధినాడు ఫిబ్రవరి 20వ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల 58 నిమిషాలకు కాలాష్టమి ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 11.57 నిమిషాలకు ముగుస్తుంది.
కాలాష్టమి నాడు ధృవ యోగం
కాలాష్టమి సందర్భంగా ఏర్పడే ధృవ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది. ముఖ్యంగా రెండు రాశుల వారు ధృవ యోగం కారణంగా లబ్ధిని పొందుతున్నారు.
ధృవ యోగంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇల్లు కట్టుకోవడం, భూములు కొనుగోలు చేయడం వంటి శాశ్వత పనులు ఈ సమయంలో చేయగలుగుతారు. ధృవ యోగంతో కాలాష్టమి నాడు లబ్ధిని పొందే ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కన్య రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యారాశికి అధిపతి బుధుడు. గ్రహాల రాకుమారుడు తెలివితేటలకు కారకుడు అయిన బుధుడు కాలాష్టమి రోజు కన్యా రాశి వారికి లబ్ధిని చేకూరుస్తున్నాడు. ఈ సమయంలో కన్యా రాశి వారు మతపరమైన యాత్రలు చేస్తారు. కన్యారాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాలాష్టమి నాడు నల్ల కుక్కకు పాలు తాగించడం, కన్య రాశి జాతకులకు మంచిని చేకూరుస్తుంది. ఇది కన్యారాశి జాతకుల పనులలో సానుకూలతను వేగాన్ని పెంచుతుంది.
ధనుస్సు రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాలాష్టమి రోజు ధనుస్సురాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. కాలాష్టమి నాడు ధనుస్సురాశి వారి జీవితంలో దుఃఖాలు తొలగిపోయి ఆనందం వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల ద్వారా ధనుస్సు రాశి జాతకులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. కుజ భగవానుడు కారణంగా ధనుస్సురాశి జాతకులు కెరీర్లో పురోగతిని సాధిస్తారు. కాలాష్టమి నాడు ఎవరైతే సమాజంలో పెద్దలకు సేవ చేస్తారో వారికి శుభం జరుగుతుంది.
కాలాష్టమి నాడు ఇలా చెయ్యండి
కాలాష్టమి నాడు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఇంటికి ఈశాన్య దిశలో శుభ్రమైన ప్రదేశంలో కాలభైరవుని విగ్రహం లేదా చిత్రాన్ని బట్టి పంచామృతంతో పూజలు చెయ్యాలి.. స్వామికి సుగంధ ద్రవ్యాలు, తెల్లని పూలదండ, మరియు గంధపు తిలకాన్ని సమర్పిస్తే కాలభైరవుడు ప్రసన్నమవుతాడు. కాలభైరవుని పూజలో ఆవ నూనె ను ఉపయోగిస్తే మంచిది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications