Diwali 2024: దీపావళి పండుగ నాడు ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహం.. మీకు దరిద్రం!

దీపావళి పండుగ నాడు లక్ష్మీ దేవిని, వినాయకుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళి పర్వ దినాన లక్ష్మీ పూజకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. దీపావళి పండుగ నాడు కొన్ని పనులు చేస్తే లక్ష్మీ దేవి సంతోషిస్తుంది. అంతేకాదు దీపావళి నాడు అస్సలు చెయ్యకూడని కొన్ని పనులు కూడా ఉన్నాయి. అవేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

దీపావళి నాడు ఇవి అస్సలు చెయ్యొద్దు
దీపావళి నాడు పొరపాటున కూడా ఇంట్లో ఏ మూలలోనూ చీకటి ఉండకుండా చూసుకోవాలి. పండుగ రోజు ఇల్లు చీకటిగా ఉంటే లక్ష్మీ దేవి ఇంటికి రాదు. దీపావళి పండుగ రోజు సాయంత్రం ఎవరికీ డబ్బులు ఇవ్వడం మంచిది కాదు. పండుగ రోజు అప్పులు ఇవ్వకూడదు ఎవరి దగ్గర అప్పులు తీసుకోకూడదు.

Diwali 2024 Don t do these things on Diwali festival Poverty will come

దీపావళి నాడు ఇలా చేస్తే సంపద నష్టం
దీపావళి రోజు అప్పు ఇచ్చినా, అప్పు తీసుకున్న మంచి జరగదని చెబుతారు. ఇచ్చినవారికి తిరిగి ఆ డబ్బు రాకపోగా , అప్పు తీసుకున్నవారు కూడా చెల్లించలేని పరిస్థితి వస్తుంది. దీపావళి పండుగ రోజు చీకటి పడిన తరువాత ఇల్లు చీపురుతో ఊడ్వ కూడదు. ఒకవేళ అలా చీకటి పడిన తరువాత ఇల్లు ఊడిస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చి సంపద నష్టం జరుగుతుంది.

దీపావళి పండుగ నాడు ఇలా చేస్తే పేదరికం
దీపావళి రోజు సూర్య అస్తమయానికి ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇక దీపావళి పండుగ రోజు ఎవరూ మద్యాన్ని, మాంసాన్ని ముట్టుకోకూడదు. దీపావళి పండుగ నాడు తులసి ఆకులను తుంచకూడదు. తులసి మాతను లక్ష్మీదేవిగా భావిస్తారు. దీపావళి రోజు సాయంత్రం తులసి మాతను తాకటం, ఆకులను తుంచడం చేస్తే ఇంట్లో పేదరికం వస్తుంది.

దీపావళి పండుగకు ఈ విషయాలలో జాగ్రత్త
దీపావళి పండుగ రోజు పొరపాటున కూడా ఎవరితోనూ గొడవకు దిగకూడదు. అలా గొడవలు పడితే ఇంట్లో ప్రతికూలతలు పెరుగుతాయి.
దీపావళి పండుగ నాడు ఎవరిని అవమానకరంగా మాట్లాడకూడదు. ఎవరినీ బాధ పెట్టకూడదు. ఇంట్లో మహిళలు కన్నీరు పెట్టుకోకూడదు. దీపావళి పండుగ రోజు ఎవరు నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. ఈ నియమాలను జాగ్రత్తగా పాటిస్తే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+