Diwali 2024: దీపావళికి ఈ పనులతో మీ ఇంటికి నడిచొచ్చే లక్ష్మీదేవి!
హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగ దీపావళి పండుగ. దీపావళి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ బంధుమిత్రులతో కలిసి సంబరాలు జరుపుకుంటారు దీపాలను వెలిగించి, బాణాసంచా కాలుస్తూ, తియ్యని మిఠాయిల రుచులను ఆస్వాదిస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. అటువంటి దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు ఇంటిని అందంగా ముస్తాబు చేస్తారు.
దీపావళికి ఈ పనులు చేస్తే సానుకూల శక్తి
దీపావళి పండుగ దగ్గర పడుతుంది అంటేనే ఇంటిని శుభ్రం చేసుకోవడం, ఇంటిని డెకరేట్ చేయడం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేస్తారు అయితే దీపావళి పండుగ సందర్భంగా ఇంటిని శుభ్రం చేసుకునే విషయంలో అలంకరించుకునే విషయంలో కొన్ని వాస్తుచిట్కాలు పాటిస్తే మంచిది. సరైన విధానంలో ఇంటిని అలంకరించుకుంటే, దీపావళి రోజు కొన్ని పనులు చేస్తే ఇంటికి సానుకూలశక్తి వస్తుంది. సంతోషం ఆ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది

ఈ పని చేస్తే దీపావళికి లక్ష్మీ కటాక్షం
వాస్తు శాస్త్రం ప్రకారం దీపావళికి ప్రతి ఒక్కరూ చేయవలసిన మొదటి పని ఇంటిని శుభ్రపరచుకోవడం. ఇంట్లోని ప్రతి మూలను శుభ్రంగా చేసుకోవడం ద్వారా ప్రతికూల శక్తులను సమర్థవంతంగా నిరోధించవచ్చు . దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే, ఎక్కడ బూజు, చెత్తాచెదారం లేకుండా చూసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది.
దీపావళికి ఈ విషయాల పట్ల శ్రద్ధ అవసరం
అంతే కాదు దీపావళి పండుగకు ఇంట్లో పాడైపోయిన వస్తువులు ఉంచుకోకూడదు. ఉపయోగించని వస్తువులు, ఎలక్ట్రానిక్స్ వస్తువులను, విరిగిపోయిన వస్తువులను, పగిలిపోయిన అద్దాలను పారేయాలి. పొరపాటున కూడా వీటిని ఇంట్లో ఉంచుకోకూడదు. వీటితో ప్రతికూలత వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు దీపావళికి ఇంటి యొక్క ఈశాన్య, ఉత్తర దిశలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఉత్తర ,ఈశాన్య దిశలు కుబేరుడికి, విష్ణుమూర్తికి నిలయాలు అని చెబుతారు.
ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వెయ్యాలంటే ఇలా చెయ్యండి
కాబట్టి ఈ రెండు దిశలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. ఇక దీపావళికి ఇంటి ప్రధాన ద్వారం ను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రధాన ద్వారం నుండి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి, ఇంటి ప్రధాన ద్వారం వద్ద శుభ్రంగా ఉంచుకోవాలి. ఆకర్షణీయంగా డెకరేట్ చేసుకోవాలి. ఇక ఈ పనులు దీపావళికి చేసుకుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications