ఇంటి గోడలకు, పిట్టగోడలకు వాస్తు ఉంటుందా? లేదా? తెలుసుకోండి
ఇంటి నిర్మాణం పూర్తిగా వాస్తు శాస్త్రం ప్రకారమే జరుగుతుంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాస్తు నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకుంటాం. అలాగే ఇంటిచుట్టూ ఉంటే పిట్టగోడలు, గోడలకు కూడా వాస్తు ఉంటుందా? వాస్తు ప్రకారం ఇంటి చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉండాలనే విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం.
ఇంటి గోడల వల్ల ఎటువంటి దోషాలు ఉండవు.
వాస్తు ప్రకారం ఇల్లు కడితే, ప్రహరీ గోడ, కాంపౌండ్ కూడా అలాగే కట్టుకోవాలి.
ఇంటికి ఆనుకొని పక్కన ఉండే ఇళ్లు ఉంటాయి.
వాటి ప్రభావం కచ్చితంగా మీ ఇంటిపై పడుతుంది.
అందుకే పునాది సరిగా ఉండేలా చూసుకోవాలి.
సొంతింటికి అందుకే హద్దులు సరిగా ఉండాలి.

ఇంటికి తగినట్లుగానే పరిసరాలు కూడా వాస్తు ప్రకారం ఉండాలి.
ఇంటితోపాటు దాని పరిసరాలు కూడా రెక్టాంగిల్ లా ఉండాలి.
ఇలా లేకపోతే డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అలాంటప్పుడు వాస్తు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
ఇంటికి తగినట్లుగానే కాంపౌండ్ కొలతలు, ఎత్తులు ఉండాలి.
ఇంటి వాస్తు ప్రకారం వాటిని మార్పులు చేసుకోవాలి.
దక్షిణం, పడమర దిక్కుల్లో ఉండే గోడలు మందంగా, బరువుగా ఉండాలి.
ఇలా ఉంటే ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించదు.
ఉత్తరం, తూర్పు దిక్కుల్లో ఉండే గోడలు దక్షిణం కంటే పలుచగా ఉండాలి.
దీనివల్ల ప్రకృతిలోని సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
దక్షిణ, పడమర గోడలు, ఉత్తర, తూర్పు గోడల కంటే కొంచెం ఎత్తుగా ఉండాలి.
దీనివల్ల అన్నీ శుభాలే జరుగుతాయి.
కాంపౌండ్ వాల్ విషయంలో తూర్పు వైపు గోడ కంటే పడమర వైపు గోడ ఎత్తుగా ఉండాలి.












Click it and Unblock the Notifications