శనివారం ఈ పనులు చేస్తే హనుమాన్ కటాక్షం; ఆరోగ్యం, ఐశ్వర్యం!!

హిందూ మతంలో ప్రతీ రోజుకూ తనదైన ప్రాధాన్యత ఉంటుంది. హిందూమతంలో శనివారానికి కూడా ఒక విశేషం ఉంది .శనివారం శని దేవుడికి అలాగే హనుమంతుడికి అంకితం చేయబడిన రోజు. ఈరోజు హనుమంతుని అనుగ్రహం ఉండాలి అంటే మంచిదని చెబుతున్నారు. హనుమంతుడి అనుగ్రహం ఉన్న వ్యక్తుల జీవితాలలో వారు అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందని, వారి జీవితం సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు.

హనుమంతుని అనుగ్రహం పొందాలంటే శనివారం రోజు కొన్ని పనులు చేయాలని సూచిస్తున్నారు. మరి హనుమాన్ దయ కోసం శనివారం రోజు చేయాల్సిన ఆ పనులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. హనుమంతుడు ఆశీర్వాదం పొందడం కోసం శనివారం రోజున హనుమాన్ చాలీసా పఠనం చేయాలి. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠనం చేసిన వారికి హనుమంతుడు అన్ని శుభాలను కలిగిస్తాడు.

Do these works for Lord hanuman blessings on Saturday!!

హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి ఆశీర్వాదం పొందడానికి శనివారం సుందరకాండ పఠనం చేయాలి. ఎవరైతే సుందరకాండను పఠనం చేస్తారో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. హనుమంతుని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీరాముని స్మరించటం చాలా సులభమైన మార్గమని చెబుతున్నారు.

హనుమంతుని ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు శనివారం నాడు జపం చేస్తే మంచిదని సూచిస్తున్నారు. అంతేకాదు శనివారం నాడు ఇష్టమైన పరిమళాన్ని, చందనాన్ని హనుమాన్ కు సమర్పిస్తే హనుమాన్ సంతోషిస్తారని చెబుతున్నారు. శనివారం నాడు హనుమంతుని ముందు చతుర్ముఖ దీపాన్ని వెలిగించడం వల్ల ఇంటికి, కుటుంబానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. అంతేకాదు

ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. శనివారం నాడు ఈ పనులు చెయ్యటం వలన హనుమాన్ ను పూజించటం వలన భయాలు, బాధలు, అనారోగ్యాలు, ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని అంటున్నారు. గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని అంటున్నారు. ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారని, సిరి సంపదలతో జీవిస్తారని చెప్తున్నారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+