మీకు నిద్రలో కలలు వస్తున్నాయా? ఒక్క నిముషం!!
ఒక వ్యక్తి తన మరణాన్ని కలలో చూసినట్లయితే, కలల సైన్స్ ప్రకారం అలాంటి కల మంచిదిగా పరిగణిస్తారు
ప్రతి ఒక్కరూ నిద్రపోతున్నప్పుడు కలలు కంటుంటారు. కొన్ని మంచివి వస్తాయి.. మరికొన్ని చెడ్డవి వస్తాయి. అయితే ప్రతి కల వెనక ఒక అర్థం ఉంటుందంటోంది కలల శాస్త్రం. ప్రతి కల వెనక రాబోయే సమయం గురించి హెచ్చరించే కొన్ని రహస్య ఆధారాలు కూడా ఉంటాయంటున్నారు. అటువంటి కలలను సూచనాత్మక కలలు అంటారు. ఒక వ్యక్తికి మంచి కలలు వస్తే వాటిని ఎవరికీ చెప్పకూడదని గ్రంథాల్లో ఉంది. డ్రీమ్ సైన్స్ ప్రకారమైతే కొన్ని కలలను ఇతరులతో పంచుకోకూడదని, అలా చేస్తే ఆ కలలు ఎప్పటికీ నెరవేరని చెబుతారు. ఏయే కలలను గోప్యంగా ఉంచాలో చూద్దాం.

సొంత మరణం
ఒక వ్యక్తి తన మరణాన్ని కలలో చూసినట్లయితే, కలల సైన్స్ ప్రకారం అలాంటి కల మంచిదిగా పరిగణిస్తారు. ఈ కల ప్రయోజనం ఎవరితోనూ పంచుకోనప్పుడు మాత్రమే మంచి చేకూరుతుంది. అలాంటి కల రాబోయే ఆనందాన్ని సూచిస్తుంది. ఎవరికైనా చెబితే వచ్చే ఆనందం దూరమవుతుంది.

కలలో భగవంతుని దర్శనం
ఒక వ్యక్తి కలలో భగవంతుణ్ని దర్శిస్తే మీ ఉద్యోగ సంబంధిత సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయనేదానికి సంకేతం. ఉద్యోగానికి సంబంధించి ఏదైనా శుభవార్త అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి కలలను రహస్యంగా ఉంచాలి.

తాగు నీరు
ఒక వ్యక్తి తన తల్లితండ్రులు కలలో నీరు తాగటం చూస్తే, అది మంచి కలగా చెబుతారు. అలాంటి కలలను ఇతరులతో పంచుకోకూడదు. వ్యక్తి పురోగతికి సంబంధించిన వీటిని ఎవరితోనైనా పంచుకుంటే ప్రగతికి అవరోధంగా మారతాయి.

వెండితో నిండిన కలశం
రాత్రి కలలో వెండితో నిండిన కలశం కనిపించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ కల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం నెరవేరుతుందని, ఎవరికైనా చెబితే లక్ష్మి వెనుదిరుగుతుందని శాస్త్రం చెబుతోంది. కొన్ని కలలను ఎవరితోను పంచుకోకుండా ఉండేవాటిలో ఇది కూడా ఒకటి.












Click it and Unblock the Notifications