బృహస్పతి తిరోగమనం... ఈ రాశులకు డబ్బే డబ్బు
జాతకంలో బృహస్పతి శుభస్థానంలో ఉంటే ఆ రాశులకు అదృష్టం విశేషంగా లభించి సంతోషాన్ని అనుభవిస్తారు. ఈనెల 9న వృషభరాశిలోకి ప్రవేశించిన బృహస్పతి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఐదోతేదీ వరకు అక్కడే ఉంటాడు. గురుడు తిరోగమనంలో ఉండటంవల్ల కొన్ని రాశులపై కనక వర్షం కురుస్తోంది. ప్రతి పనిలో విజయాన్ని అందుకోవడంతోపాటు సంపదను పెంచుకుంటారు. గురు గ్రహ తిరోగమన గోచారం అత్యంత కీలకమైంది. దీనివల్ల ఏయే రాశులవారు ఆర్థిక లాభాలను పొందుతున్నారో తెలుసుకుందాం.
మేషం
వ్యాపారస్తులకు లాభాలున్నాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. ఊహించనిరీతిలో సంపద కలిసివస్తుంది. కొత్తగా వ్యాపారాలను ప్రారంభించడానికి అనువైన సమయం ఇది.

కుంభం
వీరికి ధన ప్రవాహం పెరగడంతోపాటు సంపద పెరుగుతుంది. వేతనాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. అనుకోకుండా ధనం లభిస్తుంది.
ధనుస్సు
ఊహించని ప్రయోజనాలున్నాయి. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. విదేశీ ప్రయాణానికి అవకాశాలున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. అమితమైన లాభాలున్నాయి.
సింహ రాశి
వీరికి బంగారు రోజులు ప్రారంభమవుతాయి. పూర్వీకుల నుంచి ఆస్తి లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలకు అనువైన సమయం. కొత్తగా ఉద్యోగాలు వస్తాయి. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
కర్కాటకం
వీరికి అత్యంత లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఇది అనువైన సమయం. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో అధిక సమయం గడుపుతారు. వీరికి అన్నివిధాలుగా కలిసివస్తుంది.
మిథునం
వీరికి మహర్దశ పట్టుకుంటుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు కూడా ఇప్పుడు ప్రారంభమవుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. శుభకార్యాలకు అవకాశం ఉంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం.












Click it and Unblock the Notifications