నేటినుండి వీరు ఏం చేసినా కాసుల పంటేనని చెప్పిన ద్వి పుష్కర యోగం!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నేడు శనివారం ప్రదోష వ్రతంగా చెప్పబడుతుంది. ఇక అక్టోబర్ 4వ తారీఖున నేడు రాశి ప్రదోష వ్రతంగా చెప్తారు. ఇక శనివారం నాడు, అందునా శని త్రయోదశి నాది ప్రదోష వ్రతం ఏర్పడితే శని ప్రదోష వ్రతం గా చెబుతారు. నేడు శివుడు మరియు శనిదేవుడు ఆశీస్సులు కొన్ని రాశుల వారి పైన పుష్కలంగా ఉంటాయని చెబుతారు.
ద్వి పుష్కర యోగం.. వీరిదే అదృష్టం
నేడు శని త్రయోదశి కూడా కావడంతో శతభిష నక్షత్రంలో ద్వి పుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ ద్వి పుష్కర యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ద్వి పుష్కర యోగంతో నేటినుండి కలిసివచ్చే ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు ద్వి పుష్కర యోగం కారణంగా కలిసి వస్తుంది. ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో శుభవార్తలను వింటారు. వర్తక, వ్యాపారాలు చేసేవారు ఈరోజు మెరుగైన లాభాలను పొందుతారు. ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు భవిష్యత్తులో మీకు మంచి ప్రయోజనాలను ఇస్తాయి. ఈ సమయం వృషభ రాశి జాతకులకు అదృష్టదాయకంగా ఉంటుంది.
కన్యారాశి
కన్యారాశి జాతకులకు ద్వి పుష్కర యోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో కన్యారాశి జాతకులు అనేక ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలలో నిజాయితీగా పని చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణిస్తారు. ఎంతోకాలంగా ఇబ్బంది పడుతున్న సమస్యలు ఈ సమయంలో ముగిసిపోతాయి. ఇది కన్యా రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం.
తులారాశి
తులా రాశి వారు నేటినుండి చేసే పనులు అన్నింటిలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయాలలో మంచి ఫలితాలు వస్తాయి మీ సహోద్యోగులతో కలిసి సకాలంలో పనులన్నీ పూర్తి చేస్తారు. ఈరోజు మీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించాలి అనుకుంటే కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తులారాశి వారి ప్రేమ జీవితం ఈ సమయంలో బలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో తులారాశి జాతకులు సంతోషంగా గడుపుతారు. తులా రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications