Election results 2024 మోడీ ప్రభంజనం.. దేశంలో కమల వికాసం.. జ్యోతిష్య అంచనాలు తేల్చిందిదే!!
లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం తాలూకా ఫలితాలు ఈరోజు వెలవడబోతున్నాయి. ఏ పార్టీ అధికారం సాధిస్తుంది? ఏ పార్టీ అధికారాన్ని కోల్పోతుంది? అనేది నేడు తేలనుంది. ఇప్పటికే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశంలో మళ్ళీ ఎన్డీఏ సర్కారు వస్తుందని స్పష్టం చేశాయి. మోడీ ప్రభంజనం కొనసాగుతుందని పేర్కొన్నాయి.
దేశంలో మళ్ళీ కమల వికాసం
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రమే కాకుండా జ్యోతిష్య శాస్త్ర అంచనాలు కూడా ఈసారి మళ్లీ దేశంలో కమల వికాసమేనని స్పష్టం చేస్తుంది. బిజెపి మరియు కాంగ్రెస్ పార్టీల యొక్క జాతకాలను బట్టి అనేక జ్యోతిష్య శాస్త్ర పండితులు నేటి ఎన్నికల ఫలితాలను వివరిస్తున్నారు. బిజెపి కుండలిలో బృహస్పతి యొక్క ప్రస్తుత అమరిక బలంగాను మరియు చంద్రునితో సంపూర్ణంగా సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోందని చెప్తున్నారు.

ఎన్దీయే కు 400 సీట్లు
బీజేపీ అనేక అడ్డంకులు ఎదుర్కోకుండానే 2024 లోక్సభ ఎన్నికలలో సునాయాసంగా విజయం సాధించడాన్ని ఇది సూచిస్తుందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో బిజెపి సానుకూలత మరియు అభివృద్ధి దిశగా దేశాన్ని సంస్కరించడం కొనసాగించడాన్ని ఈ ఎన్నికల ఫలితాల ద్వారా చూడొచ్చని చెబుతున్నారు. ఈ ఏడాది లోక్సభ ఎన్నికలలో ఎన్డీఏకు 400 సీట్లు రావడం ఖాయంగా కనిపిస్తోందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
గతం కంటే ఎక్కువ స్థానాల్లో ఇండి కూటమి
నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ ఈసారి కూడా విజయ కేతనం ఎగురవేస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే లోక్సభ 2024 ఎన్నికల సమయంలో సూర్యుడు చంద్రుడు మరియు బృహస్పతి కలయిక కారణంగా కాంగ్రెస్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీ వంటి ఇతర రాజకీయ పార్టీలు ఈ సంవత్సరం మెరుగైన పని తీరును కనబరిచాయి. అవి గతంలో సాధించిన దాని కంటే ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ఇండి కూటమికి అధికారం కష్టమే
అయితే ఈ ఏడాది అధికార పార్టీని ఏర్పాటు చేసేందుకు వారికి వచ్చిన సీట్ల సంఖ్య సరిపోయేలా కనిపించడం లేదు. బిజెపిని ఓడించేందుకు ఏర్పాటు చేసిన ఇండికూటమి బలం ఈసారి సరిపోయేలా లేదు అందువల్ల లోక్సభ ఎన్నికలలో ఇండికూటమి ప్రజయం పాలై అధికారాన్ని కోల్పోతుందని, బిజెపి విజయం సాధించడం ఇది సులభం చేస్తుందని చెబుతున్నారు. మొత్తానికి కౌంటింగ్ కొనసాగుతున్న వేళ ఇప్పటికి వస్తున్న ట్రెండ్స్ ప్రకారం బిజెపి లీడింగ్ లో కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications