వాస్తు ప్రకారం ఇల్లు ఉన్నా.. ఈ పనులు మాత్రం ఇంట్లో చేయకూడదు
అందరూ ఇంటిని నిర్మించుకొనేటప్పుడు వాస్తు ప్రకారమే నిర్మించుకుంటారు. సొంతిల్లు అయినా, అద్దె ఇల్లు అయినా వాస్తు ప్రకారమే ఉండాలి. వాస్తును అనుసరించాలి. వాస్తు అంటే ప్రదేశం అనే అర్థం వస్తుంది. శాస్త్రం అంటే రక్షించేది. అంటే ఆ ప్రదేశాన్ని రక్షించేది అని అర్థం. దీన్ని మన పూర్వీకులు అందించారు. మనదేశంలో ఏ కట్టడమైన వాస్తు ప్రకారమే నిర్మాణం జరుపుకుంటుంది. అయితే ఇంట్లో కొన్ని చేయకూడని పనులు చేస్తుంటారు. దీనివల్ల వాస్తు బాగున్నప్పటికీ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇంటికి ఎదురుగా ఆస్పత్రులు, మాంసాహార దుకాణాలు ఉండకూడదు.
ఇనుము వస్తువుల తయారీ షాపులు కూడా ఉండకూడదు.
ఇంటి ముందు మనీప్లాంట్ తీగలు అల్లుకోకూడదు.
అలా జరిగితే ఆ ఇంట్లో దుష్టశక్తుల ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నాురు.

ఇంట్లో అక్వేరియం ఉండకూడదు.
దీనివల్ల ఇంటి యజమానికి మానసికంగా ప్రశాంతత ఉండదు.
బాధలను, కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అప్పులు పెరుగుతాయి.
తలకు పైన వేలాయుధంతో కూడిన కుమార స్వామి బొమ్మ, కప్పలు ఉండకూడదు.
అడుగుకు మించిన దేవతా మూర్తుల విగ్రహాలు ఉండకూడదు.
ఇంటి హాలులో మహాభారత యుద్ధ సన్నివేశాలు ఉండకూడదు.
ఆ ఫొటోలుంటే తీసేయాలి.
లేదంటే రుణ సమస్యలు పెద్దవవుతాయి.
పనిచేయని గడియారాలున్నా తీసేయాలి.
వ్యాపారాలు చేసే ప్రాంతం చతురస్రా కారంలో ఉండాలి.
దీర్ఘచతురస్రాకారంలో కూడా ఉండొచ్చు.
తూర్పు, దక్షిణ దిశలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
వ్యాపారం చేసే ప్రాంతంలో పూజ చేస్తున్నవారు తూర్పు వైపు తిరిగి చేయాలి.
ఇలాంటివన్నీ అనుసరిస్తే అన్నిరకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు.












Click it and Unblock the Notifications