జనవరి 4 వరకు ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే
గ్రహాలు స్థానం మార్చుకోవడంవల్ల కొన్ని రాశులకు కలిసివస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. నవగ్రహాలు నిర్దిష్ట్ సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్న బుధుడితో వృషభరాశిలో సంచారం చేస్తున్న గురుడు కలుస్తాడు. ఈ రెండు గ్రహాలు కలవడంవల్ల నాలుగు రాశులవారికి జనవరి నాలుగోతేదీ వరకు పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు తెలియజేస్తున్నారు. ఏ రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
వృషభరాశి
వృత్తి, వ్యాపారాల్లో పూర్తిగా కలిసివస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఇది అనుకూలంగా ఉండే సమయం. వారికి ఆదాయం పెరగడంతోపాటు కార్యాలయాల్లో మంచి పేరు వస్తుంది. ఈ రాశివారికి ఆర్థిక లాభాలున్నాయి. అనుకన్న పనులన్నీ పూర్తిచేయగలుగుతారు. అందుకు అదృష్టం తోడుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. కొన్నాళ్ల నుంచి వివాదంలో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారం కావడంతోపాటు ఆదాయం బాగా పెరుగుతుంది. జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది.

సింహరాశి
ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడంతోపాటు వీరికి రాజయోగం సిద్ధిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. అదృష్టం బాగా కలిసివస్తుంది. ఆదాయం పెరుగుతుంది. జీవితంలో ఇంతవరకు చవిచూడని సంతోషాన్ని ఈ సమయంలో చూస్తారు. ఆదాయ మార్గాల అన్వేషణలో విజయవంతమవుతారు.
వృశ్చిక రాశి
ఉద్యోగాల్లో మంచి విజయాలను సాధిస్తారు. ఈ రాశివారు ఏ పని తలపెట్టినా విజయం లభిస్తుంది. వివాహం కానివారికి ఈ సమయంలోనే పెళ్లి కుదురుతుంది. కొత్త ఇంటిని లేదంటే కొత్త వాహనాన్ని లేదంటే భూమిని కొనుగోలు చేస్తారు.
మకర రాశి
వృత్తి, వ్యాపారాల్లో ఊహించనిరీతిలో పురోగతి లభిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఉద్యోగం వస్తుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. డబ్బును సరిగా పొదుపు చేయకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. మంచిమాటలకు, జాలి మాటలకు కరిగిపోయి ఈ సమయంలో డబ్బును చేతులు మార్చొద్దు. అడిగినవారి అవసరం నిజమా? కాదా? అని గుర్తించి సాయం చేయండి. మీకు మంచి ఫలితాలుంటాయి.
మీనరాశి
కొంతకాలం నుంచి వేధిస్తున్న ఆస్తి వివాదాలు చాలా సులువుగా ఈ సమయంలోనే పరిష్కారం అవుతాయి. ఈ రాశివారికి ఇది చాలా మంచి సమయం అన్నీ అనుకూలగా జరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. ఉద్యోగం, వ్యాపారంలో గణనీయమైన పురోగతి ఉంది.












Click it and Unblock the Notifications