ఈ నెల 15 నుంచి ఈ రాశుల నుదుటిరాత మారుస్తున్న బుధుడు
కన్యారాశి గ్రహాల రాకుమారుడైన బుధుడికి సొంతరాశి. వ్యాపారానికి, తర్కానికి, తెలివితేటలకు కారకుడైన బుధుడు జాతకంలో శుభస్థానంలో ఉంటే వారి జీవితాల్లో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు సొంతరాశిలో బుధుడు సంచారం చేయడంద్వారా భద్ర మహాపురుష యోగం ఏరపడుతోంది. దీనివల్ల నాలుగు రాశులవారికి అద్భుతంగా ఉండబోతోంది. మరో రెండు రాశులవారికి ధనయోగాలున్నాయి. ఏయే రాశులకు ఎలా కలిసివస్తుందనే వివరాలను తెలుసుకుందాం.
మకర రాశి
తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసివస్తుంది. కుటుంబంలో శుభ పరిణామాలు జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నం, పెళ్లి ప్రయత్నం విజయవంతమవుతాయి. ఆర్థికంగా ఏ పని అనుకున్న విజయవంతంగా పూర్తవుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశం ఉంది.

మీన రాశి
సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తిగా పరిగణింపబడతారు. వృత్తి, వ్యాపారాల్లో చురుగ్గా ఉంటారు. ఒకరకంగా క్షణం కూడా వీరికి తీరిక ఉండదు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడతారు. మరికొందరికి పెళ్లి కుదురుతుంది.
సింహరాశి
ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో శుభకార్యాలున్నాయి. ఆదాయం పెరుగుతుంది. శుభవార్తలను అందుకుంటారు. ఆదాయం పెరగడానికి అదనపు మార్గాలు తోడవుతాయి. ఆర్థిక లావాదేవీలవల్ల కూడా కలిసివస్తుంది. సమాజంలో హోదా పెరగడంతోపాటు స్థాయి కూడా పెరుగుతుంది.
కన్యారాశి
ప్రతిభా పాటవాలు వెలుగులోకి వచ్చే సమయం ఇది. భోగభాగ్యాలను అనుభవించడంతోపాటు సమాజంలో పై స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు కలుగుతాయి. రాజకీయంగా యోగం పడుతుంది. ఉద్యోగంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు కలిగి అవి విస్తరిస్తాయి.
ధనుస్సు రాశి
మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్థులకు డిమాండ్ పెరుగుతుంది. ఆస్తులు కలిసివస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. రాజపూజ్యాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో చిన్న చిన్న ప్రయత్నాలతోనే అగ్రస్థానానికి చేరుకుంటారు.












Click it and Unblock the Notifications