మరో వారం రోజుల్లో ఈ రాశులకు అద్భుతంగా కలిసివస్తోంది!
ఈనెల 30వ తేదీన గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు పూర్వ ఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అలాగే తన సొంత రాశి అయిన సింహరాశిలోకి కూడా ప్రవేశిస్తాడు. ఈ సంచారం కొన్ని రాశులవారి జీవితాల్లో సానుకూల మార్పులు తెస్తుంది. సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించే సమయానికి బుధుడు కూడా అక్కడే ఉంటాడు. దీనివల్ల ఐదు రాశులకు అద్భుతంగా కలిసివస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో ఉంటే బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడుతుంది.
సింహ రాశి
శక్తిని ఉపయోగించి పెద్ద లక్ష్యాలను సాధిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంకానీ, వ్యాపారంలోకానీ కొత్త అవకాశాలు వస్తాయి. రచన, నైపుణ్యం, ఆర్ట్ వంటి రంగాల్లో ఉన్నవారు విజయం సాధిస్తారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.

తులా రాశి
నెట్ వర్క్ పెంచుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. మీకున్న ప్రణాళికలు అమలు చేయండి. కలలు నిజం చేసుకోవడానికి ఇది మంచి సమయం. మిత్రులు, బంధువుల సహాయంతో ప్రయోజనం పొందుతారు. సామాజికంగా, ఆర్థికంగా విజయం సాధిస్తారు.
ధనుస్సు రాశి
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సానుకూల దృక్పథం నుంచి బయటకు రావొద్దు. ఇదే విజయాన్ని అందిస్తుంది. దీర్ఘకాలికంగా ఉన్న లక్ష్యాలను సాధిస్తారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. దూర ప్రయాణాలు చేస్తారు. విహార యాత్రలకు లేదంటే పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు.
మేష రాశి
తమకున్న ఆలోచనలను, అభిరుచులను పట్టాలెక్కించడానికి ఇది మంచి సమయం. సృజనాత్మకత కలిగిన ప్రాజెక్టుల్లో పాలుపంచుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయడంతోపాటు తాను చెప్పదలుచుకుంది ఆత్మవిశ్వాసంతో చెప్పి ప్రాజెక్టుల్లో విజయం సాధిస్తారు. మీకున్న సృజనాత్మకతను బయటకు తీయడానికి ఇది మంచి సమయం. సూర్యుడి, బుధుడి సంచారం ఈ రాశి ఐదో ఇంటిపై ప్రభావం చూపుతుంది.
మిథున రాశి
కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి, సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇది మంచి సమయం. మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పడంద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు. దగ్గర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. దీనివల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు. తోబుట్టువులకు సంబంధించి ప్రభావం చూపుతుంది. మీకున్న ఎదుటివారితో మాట్లాడే వ్యక్తిత్వ తీరు, మేథస్సు పెరుగుతాయి. మంచి పేరు తెచ్చుకుంటారు.












Click it and Unblock the Notifications