ఇప్పుడు ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని శుభ యోగాలు, మరికొన్ని అశుభ యోగాలు ఏర్పరుస్తుంటాయి. సంపదకు, విలాసవంతమైన జీవితానికి, కళలకు, ఫ్యాషన్స్ కు కారకుడైన శుక్రుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇలా సంచారం చేయడంవల్ల ఐదు రాశులకు అద్భుతమైన ఆర్థిక లాభాలు కలుగుతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
మేష రాశి
కలలను నిజం చేసుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉగాది వరకు పెళ్లి ప్రయత్నాలు చేయాలి. అప్పుడు కూడా కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగం వస్తుంది. సంపద పెరిగి గౌరవాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభాలున్నాయి.

మకర రాశి
కెరీర్ పరంగా విజయాలు అందుకుంటారు. వ్యాపారంలో భారీ లాభాలను కళ్లచూస్తారు. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు మీ పరిస్థితి బాగా మెరుగవుతుంది. కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు.
మిథున రాశి
ఉద్యోగస్థులకు వారి కార్యాలయాల్లో గౌరవం లభిస్తుంది. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బలవంతులవుతారు. సంపద ఊహించని రీతిలో పెరుగుతుంది. ఎన్నాళ్లుగానో కలలు కంటున్న సొంతింటి కళ సాకారమవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు.
వృషభ రాశి
పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. చేస్తున్న పనిలో అతి పెద్ద బాధ్యతను మీకు అప్పగిస్తారు. వ్యాపారస్తులు కూడా ఈ సమయంలోనే భారీ లాభాలను అందుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధించి మంచిపేరు తెచ్చుకుంటారు. కొత్త ఉద్యోగాలు లభిస్తాయి.
కన్యారాశి
పెళ్లి కానివారికి పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. కొత్తగా ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు. సొంతింటి కలను నిజం చేసుకుంటారు. ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది.












Click it and Unblock the Notifications