ఈ రాశులకు భారీ సంపదను ఇస్తున్న బుధుడు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేసే క్రమంలో మంచి, చెడు, మిశ్రమ ఫలితాలను కల్పిస్తుంటాయి. గ్రహాల రాకుమారుడు బుధుడు జులై నాలుగో తేదీన తన దిశను మార్చుకుంటున్నాడు. ఆరోజు ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపునకు కదులుతాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి ఎంతో మంచి జరుగుతోంది. తెలివితేటలు, తర్కం, వ్యాపారం, వాక్చాతుర్యం తదితరాలకు బుధుడు కారకుడు. మంచి జరిగే రాశుల్లో మీ రాశి కూడా ఉందో? లేదో? తెలుసుకోండి.
మకర రాశి
కొత్త ప్రాజెక్టులను చేపడతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కమ్యూనికేషన్ ఫీల్డ్ లో ఉన్నవారు, సాంకేతిక రంగంలో ఉన్నవారికి ఇప్పుడు కలిసివచ్చే సమయం. కొత్తగా బాధ్యతలు చేపడతారు.

కన్యా రాశి
ఆగిపోయిన కెరీర్ ఈ సమయంలోనే తిరిగి ప్రారంభమవుతుంది. కుటుంబ సభ్యులతో అందరూ సంతోషంగా ఉంటారు. ఈ సమయం మీకు బాగా కలిసివస్తుంది. ఆర్థికంగా అనేక రకాల లాభాలున్నాయి.
వృషభ రాశి
ఉద్యోగస్థులకు బదిలీలున్నాయి. వ్యాపారస్తులకు కొత్త వినియోగదారులు వస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఉద్యోగస్థులకు ప్రమోషన్లు కూడా ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బంది లేదు. అన్నీ శుభ ఫలితాలే కలుగుతున్నాయి.
కర్కాటక రాశి
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను ఈ సమయంలోనే అందుకుంటారు. కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం. ఏకాగ్రత పెరుగుతుంది. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి.
వృశ్చిక రాశి
ఇక రాదు అనుకున్న డబ్బు మీ చేతికి వస్తుంది. ఇది మంచి సమయం. ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. జీవితంలో సంతోషాన్ని అనుభవిస్తారు. ఆర్థికంగా అన్నివిధాలుగా కలిసివస్తుంది.












Click it and Unblock the Notifications