ఈ రాశులకు కలలో కూడా ఊహించనిరీతిలో అష్టైశ్వర్యాలనిస్తున్న బృహస్పతి

ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొన్ని శుభ ఫలితాలను, మరికొన్ని అశుభ ఫలితాలను కలిగిస్తాయి. ఒక్కో గ్రహం ఒక్కో ప్రభావాన్ని చూపుతుంది. ఈనెల తొమ్మిదో తేదీ నుంచి దేవ గురువు బృహస్పతి వక్రమార్గంలో పయనిస్తాడు. దీనివల్ల ఐదు రాశులవారి సుడి తిరగబోతోందని చెప్పొచ్చు. అదృష్టం పట్టుకోవడంవల్ల జీవితంలో అనుకున్నది సాధించడమేకాదు ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.

కర్కాటకం
ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతోపాటు పదోన్నతి లభిస్తుంది. మంచి ఆరోగ్యం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొత్త ఇంటిని లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఈ రాశివారికి అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగం మారడానికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణమైన మద్దతు లభించడంతో అన్ని పనులు ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు.

five zodiac signs will get more benefits and more money due to jupiter retrograde

మిథున రాశి
ఈ రాశివారికి గురుదేవుడు తిరోగమన దిశలో సంచరిస్తుండటంవల్ల గురుబలం పెరుగుతుంది. ఆయన అనుగ్రహంతో వీరికి తిరుగులేదని చెప్పొచ్చు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నవారికి ఇది మంచి సమయం. పరీక్షలో విద్యార్థులు విజయం సాధించి మంచి స్థానానికి చేరుకుంటారు. ఫిబ్రవరి వరకు వీరికి అన్నీ కలిసివస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం నాలుగు రెట్లు ఎక్కువగా లభిస్తుంది. అందుకు కారణం కూడా గురుబలమే.

ధనస్సు
ఈ రాశివారికి సమాజంలో గౌరవం పెరగడంతోపాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నవారు ఈ సమయంలో ప్రయత్నం చేస్తే విజయవంతమవుతారు. అన్ని మార్గాలు అనుకూలంగా మారతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు ఈ సమయంలో తిరిగి ప్రారంభిస్తే ఉన్నతస్థాయికి చేరుకుంటారు.

వృశ్చిక రాశి
కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేస్తారు. విదేశాలకు వెళ్లాలనుకుంటున్న కోరిక తీరుకుంది. వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్థలు తొలగిపోతాయి. అందరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది.

కన్య రాశి
మంచి ప్రయోజనాలను పొందుతారు. విదేశీ ప్రయాణం చేయడానికి ఇది అనువైన సమయం. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. విద్యార్థులకు మంచి సమయం. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన సమయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+