త్వరలో ఐదు రాశులకు మహా దరిద్రం తధ్యమన్న పిశాచయోగం!

మార్చి 29వ తేదీన కుంభ రాశిలో ఉన్న శని మీన రాశిలోకి సంచారం చేయబోతున్నాడు అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహమైన శని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడానికి రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది. అయితే శని రాశి సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది.

శని రాహువుల కలయికతో పిశాచ యోగం
మార్చి 29న శని మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు రాహువు అక్కడే ఉండడంతో శని రాహువుల కలయిక ఒక అశుభయోగాన్ని సృష్టిస్తుంది. శని రాహువుల కలయిక కారణంగా ప్రమాదకరమైన పిశాచ యోగం ఏర్పడుతుంది. ఇది మే 18 వరకు కొనసాగుతుంది. దీని కారణంగా ఐదు రాశులకు దరిద్రం పట్టబోతుంది. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

Five zodiac signs will soon face poverty with saturn rahu pishach yoga

వృషభ రాశి
వృషభ రాశి వారికి శని రాహువుల సంయోగం వలన ఏర్పడిన పిశాచ యోగం దరిద్రాన్ని తెస్తుంది. వీరు స్నేహితులతో మోసగించబడతారు. దగ్గర వారిని నమ్మితే ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ బాధ్యతల భారం పెరుగుతుంది. తోడబుట్టిన వారితో వివాదాలు వస్తాయి. ఇక వ్యాధులు ఇబ్బంది పెడతాయి. కార్యాలయంలో కూడా పని ఒత్తిడిని ఎదుర్కొంటారు.

మిధున రాశి
శని రాహువులు మిధున రాశి వారి పదవ ఇంట్లో సంచరిస్తాయి. దీంతో ఈ సమయం ఉద్యోగులకు, వ్యాపారులకు ఇబ్బందికరంగా ఉంటుంది. వీరి ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగాలు చేసేవారు ఒత్తిడిని ఎదుర్కొంటారు. స్నేహితుల కారణంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

సింహరాశి
శని రాహువులు ఏర్పరుస్తున్న పిశాచ యోగంతో సింహరాశి వారి జీవితం మారుతుంది. సింహరాశిలో శని రాహువుల సంచారం ఎనిమిదవ ఇంట్లో ఉన్నందున ఈ సమయం కష్ట కాలంగా చెప్పవచ్చు. ఈ సమయంలో వీరిని అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కొంటారు. శత్రువులు మీపై ఆధిపత్యం చేసే అవకాశం ఉంది. చట్టపరమైన సమస్యలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. అప్పుల పాలవుతారు.

కన్య రాశి
పిశాచ యోగం కారణంగా కన్యా రాశి వారికి ఇబ్బందులు వస్తాయి. కన్య రాశిలో ఏడవ ఇంట్లో శని రాహువుల సంచారం చేస్తారు కాబట్టి ఇది కన్యా రాశి వారికి ఆరోగ్య సమస్యలను తెస్తుంది. జీవిత భాగస్వామితో విభేదాలు పెరుగుతాయి. ప్రేమ జీవితంలో ఓపికగా ఉండాలి లేదంటే సంబంధాలు చెడిపోతాయి. కడుపు సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మోసపోయే అవకాశం ఉంటుంది.

ధనుస్సు రాశి
పిశాచ యోగం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు దురదృష్టం మొదలవుతుంది. అత్త కోడళ్ళ మధ్య విభేదాలు వస్తాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో బాగా కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఇక పని చేసే చోట కూడా ఇబ్బందులు వస్తాయి. ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+