మహా కుంభమేళాకు వెళ్ళలేని వారికి మౌని అమావాస్య నాడు సువర్ణావకాశం!

హిందువుల అతి ముఖ్యమైన, అత్యంత విశిష్టమైన మహాకుంభమేళా జరుగుతుంది. కోట్లాదిమంది భక్తులు మహాకుంభమేళాలో సంగమ స్నానాలను ఆచరించడానికి వస్తున్నారు. దీంతో ప్రయాగ్ రాజ్ కిటకిటలాడుతోంది. అయితే కుంభమేళాకు వెళ్లాలని ఆసక్తి ఉండి వెళ్ళలేకపోతున్నవారు తెగ మదన పడుతున్నారు. అలాంటి వారి కోసం కొన్ని పరిహారాలు ఉన్నాయని వాటిని చేస్తే కుంభమేళాకు వెళ్ళినంత పుణ్యఫలం వస్తుందని చెబుతున్నారు పండితులు.

పవిత్ర నదులలో స్నానం చేస్తే కుంభమేళాలో స్నానం చేసిన పుణ్యఫలం
మహా కుంభమేళాకు వెళ్లలేనివారు మౌని అమావాస్య రోజున పవిత్ర నదులలో పుణ్యస్నానం చేస్తే మహా కుంభమేళాలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. మూడుసార్లు లేదా ఐదు సార్లు పవిత్ర నదిలో మునక వేసి శ్రీహరికి, లక్ష్మీదేవికి, గంగామాతకు పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. మౌని అమావాస్య రోజున మహాకుంభమేళాకు వెళ్లలేని భక్తులు మౌన ఉపవాస దీక్షను చేస్తే కూడా శుభాలు చేకూరుతాయని, దీనివల్ల శుభం కలుగుతుందని చెబుతున్నారు.

For those who cannot attend the Maha Kumbh Mela Mauni Amavasya is a golden opportunity

మౌని అమావాస్య నాడు ఇలా చెయ్యండి
మౌని అమావాస్య రోజున సాయంత్రం ఇంట్లో తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి భక్తితో పూజలు చేస్తే కూడా ఫలితం బాగుంటుందని చెబుతున్నారు. మౌని అమావాస్య రోజున తెల్లవారుజామున భక్తులు మనకు కనిపించే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి అర్గ్యాన్ని సమర్పించి పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

ఇలా చేస్తే పవిత్ర స్నానం చేసినంత పుణ్యఫలం
ఎవరైతే మౌని అమావాస్య రోజున ఓం పితృదేవతాయై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తారో వారి పూర్వీకులకు ఆత్మశాంతి కలుగుతుందని, దీనివలన మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని చెబుతున్నారు. జనవరి 29వ తేదీన మౌని అమావాస్య కుంభమేళా జరుగుతున్న వేళలో ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా పురాణాలు చెబుతున్నాయి.

పవిత్రమైన మౌని అమావాస్యతో పుణ్య ఫలాలు
మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండడం అని అర్థం. మౌని అమావాస్య నాడు మౌన దీక్షను పాటించి ఎవరితోనూ మాట్లాడకుండా ఎవరైతే ఉపవాస దీక్షను ఆచరిస్తారో వారికి పుణ్య ఫలాలు లభిస్తాయి అని చెబుతారు. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో దీనిని సాధువులు, యోగ సాధకులు అందరూ పవిత్రంగా పరిగణిస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+