ఆగస్టు 12 నుంచి ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
ఆగస్టులో కీలక గ్రహాలు రాశి సంచారం చేస్తున్నాయి. సంపదకు కారకుడైన శుక్రుడు, జ్ఞానానికి కారకుడైన బృహస్పతి ఈనెల 12వ తేదీన సంయోగం చెందుతారు. చాలా అరుదుగా సంభవించే ఇటువంటి అరుదైన పరిణామం కొన్ని రాశులకు అదృష్టాన్ని మోసుకొస్తోంది. రాక్షసులకు గురువు శుక్రుడు.. దేవతలకు గురువు బృహస్పతి. అలాంటి గ్రహాలు సంయోగం చెంది గజలక్ష్మీ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఇది నాలుగు రాశులకు పలు ఆర్థిక ప్రయోజనాలు కలిగిస్తోంది.
మిథున రాశి
ప్రేమలో ఉన్నవారి జీవితం చాలా మధురంగా సాగుతుంది. పలు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి భవిష్యత్తు సొంతమవుతుంది. కెరీర్ పరంగా కూడా అవకాశాలు వస్తాయి. వ్యాపారం బాగా కలిసివస్తుంది. ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే యోచనలో ఉంటారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తవుతాయి.

కుంభ రాశి
ఆర్థికంగా అనేక లాభాలను ఈ రాశివారు పొందుతారు. పిల్లల వల్ల మంచి సంతోషం సొంతమవుతుంది. వ్యాపారస్తులకు మాత్రం బాగా కలిసివస్తుంది. వినియోగదారులు పెరుగుతారు. ఆర్డర్లు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి అన్ని పనులకు సంపూర్ణమైన మద్దతు దొరుకుతుంది.
మేష రాశి
కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు ఈ సమయంలో అధిక లాభాలున్నాయి. వచ్చిన డబ్బును కొత్త వ్యాపారాలవైపు మళ్లిస్తారు. ఉద్యోగస్థులకు కూడా మంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ప్రయాణాలుంటాయి. ఏ పనినైనా విజయవంతంగా పూర్తిచేయడం ఈ రాశివారికి అలవాటు. ఉద్యోగస్థులు పై అధికారుల మెప్పును పొందుతారు.
వృషభ రాశి
ఆర్థికంగా గతంలోకంటే ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇది చాలా అనువైన సమయం. కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి వెళతారు. పలు లాభాలుండటంతో వచ్చిన డబ్బును భవిష్యత్తులో రాబడి వచ్చేలా పొదుపు చేసుకోవాలి. దుబారా ఖర్చులను నియంత్రించుకోవాలి.












Click it and Unblock the Notifications