Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2026లో బృహస్పతి వల్ల కోటీశ్వరులయ్యే రాశులు వీరే

వచ్చే ఏడాది డిసెంబరు 13వ తేదీ నుంచి దేవతల గురువైన బృహస్పతి సింహరాశిలో తిరోగమనంలో సంచారం చేస్తాడు. అయితే 2026 మొదట్లోనే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 2026 అక్టోబరు 31వ తేదీ వరకు అదే రాశిలో గురువు సంచారం చేస్తాడు. ఈ ప్రభావంతో కొత్త సంవత్సరంలో కొన్ని రాశులకు అద్భుతమైన రాజయోగం కలగబోతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏయే రాశులకు ఏవిధంగా బృహస్పతి వల్ల కొత్త ఏడాదిలో అద్భుతంగా కలిసిరాబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం.

మిథున రాశి
కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి. ఈ రాశివారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. హోదా పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఎదుటివారితో మాటతీరు మిమ్మల్ని అందలం ఎక్కిస్తుంది.

four zodiac signs that will become millionaires in 2026 due to Jupiter

కన్యా రాశి
ఉద్యోగంలో వేతనం పెరుగుతుంది. దాంతోపాటు ప్రమోషన్ వస్తుంది. ఆదాయం మంచి పెరుగుదలను నమోదు చేస్తారు. కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. గురువు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. వివాహం చేయడంతోపాటు సంతానాన్ని కూడా ప్రసాదించి ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గం చూపుతాడు.

కర్కాటక రాశి
ఉద్యోగస్థులకు వేతనం పెరగడంతోపాటు పదోన్నతి కూడా లభిస్తుంది. వ్యాపారస్తులకు మాత్రం వారు ఊహించనిరీతిలో లాభాలు అందుకుంటారు. పెళ్లయినవారు జీవితంలో కొత్త ఆనందాన్ని పొందుతారు. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. విద్యార్థులకు బాగుంటుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన అవసరంలేదు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు రావు.

తులా రాశి
వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కొత్త ప్రాంతాలకు వ్యాపారాలను విస్తరిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెడతారు. కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఇకనుంచి ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది. ఆర్థికంగా కుదుటపడతారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+