మే నెలలో ఈ రాశులు మహర్జాతకులవుతున్నారు
గ్రహాల రాకుమారుడు బుధుడు. తెలివితేటలు, తర్కం, లెక్కలు, జ్ఞానం.. ఇలా అన్నింటికి కారకుడు. వచ్చే నెలలో బుధుడు రెండు రాశుల్లోకి సంచారం చేయబోతున్నాడు. ఇది చాలా అరుదుగా సంభవించే పరిణామం. వచ్చే నెల 7వ తేదీన మేషరాశిలోకి ప్రవేశించే బుధుడు అదే నెల 23వ తేదీన వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా రెండు రాశుల్లోకి సంచారం చేయడంవల్ల బుధుడు శుభస్థానంలో ఉన్న జాతకులకు సంపద, తెలివితేటలతోపాటు జ్ఞానం కూడా అబ్బుతుంది. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. ఏయే రాశులకు బుధుడివల్ల ప్రయోజనాలున్నాయనే విషయాన్ని కింద తెలుసుకుందాం.
కర్కాటక రాశి
కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఎదురుచూస్తున్నవారికి ఇది చాలా మంచి సమయం. అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్థులకు, వ్యాపారస్తులకు ఇద్దరికీ ఈ సమయం కలిసివస్తుంది. కొన్నాళ్లుగా నష్టాలను ఎదుర్కొంటున్నవారికి మంచి ఆదాయం రానుంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే వీరికి తిరుగుండదు. ఉద్యోగాలు రానివారికి ఈ సమయంలోనే ఉద్యోగం వస్తుంది.

కుంభ రాశి
ఉద్యోగస్థులకు వేతనాలు పెరుగుతాయి. అలాగే బదిలీకి అవకాశం ఉంది. కోరుకున్నచోటకు వెళతారు. నెరవేరని కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరతాయి. వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. వచ్చిన డబ్బును భవిష్యత్తులో మంచి రాబడి వచ్చేలా పెట్టుబడి పెట్టాలి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సమయాన్ని వెచ్చిస్తారు.
మేష రాశి
సడేసతి వల్ల ఇబ్బందులు పడుతున్నవారికి ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగస్థులకు ప్రమోషన్ ఉంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. తెలివితేటలతో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి విజయాన్ని అందుకుంటారు.
వృషభ రాశి
ఈ రాశివారి వ్యక్తిత్వం చాలా మారిపోతుంది. కొంతకాలం పెళ్లికాని అమ్మాయిలకు ఈ సమయంలో పెళ్లి అవుతుంది. కోరుకున్న వరుడు లభిస్తాడు. వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. ఇతర వ్యాపారాల్లోకి వచ్చిన డబ్బును పెట్టుబడి పెడతారు. ఉద్యోగస్థులకు పదోన్నతితోపాటు కోరుకున్న హోదా లభిస్తుంది. అలాగే ధనవంతులవుతారు.












Click it and Unblock the Notifications