ఈ నెల 7వ తేదీ నుంచి ఈ రాశుల తలరాత మారిపోయింది!

ఈ నెల 7న చంద్ర గ్రహణం రోజు చంద్రుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. అదే సమయంలో గ్రహాలకు అధిపతి సూర్యుడు, గ్రహాల రాకుమారుడు బుధుడి కలయిక జరిగింది. అలాగే దేవతల గురువైన బృహస్పతి, చంద్రుడి సంయోగం కూడా జరిగింది. ఈ రెండు పరిణామాలవల్ల బుధాదిత్య యోగం, నవంపచమి రాజయోగం ఏర్పడ్డాయి. దీంతో ఈనెల 7వ తేదీ నుంచి కొన్ని రాశులవారు భారీగా లాభపడుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంవల్ల వీరి జీవితాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఏయే రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రణాళికలు వేసి మంచి విజయాలు సాధిస్తారు. కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు. దీర్ఘకాలంలో ఊహించనిరీతిలో విజయవంతమవుతారు. అనుకున్నదానికన్నా ఎక్కువ లాభాలను వ్యాపారస్తులు అందుకుంటారు. వారికి బాగా కలిసివస్తుంది.

four zodiac signs will become millionaires due to bhudhaditya and navapanchami rajayogams from this month 7th

ధనుస్సు రాశి
గృహ నిర్మాణ రంగానికి సంబంధించిన వారికి అద్భుతమైన లాభాలున్నాయి. సామాజిక సేవలో ఉన్న వ్యక్తులకు మాత్రం ప్రత్యేకమైన బాధ్యతలు అందుతాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలగడంతోపాటు మంచి గౌరవాన్ని అందుకుంటారు. జీవిత భాగస్వామి మద్దతుతో గెలుపొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

వృషభ రాశి
జీవితంలో ఆనందం సొంతమవుతుంది. దాంపత్య జీవితం గతం కంటే ఇప్పుడు బాగుంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తులు కలిసివస్తాయి. వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి. ప్రణాళిక ప్రకారం చేసే పని విజయవంతమవుతుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. 7వ తేదీ నుంచి వీరి జీవితాలు చాలా బాగున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

కన్యా రాశి
అనుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. ప్రేమలో ఉన్నవారి జీవితం సంతోషంగా ఉంటుంది. మీపై ప్రత్యర్థులు ఓటమిపాలవుతారు. శత్రువుల బాధ నుంచి బయటపడతారు. జీవితంలో దేనికీ లోటుండదు. ప్రయాణాలు చేయాలనుకుంటున్నవారికి ఇది చాలా మంచి సమయం. తెలివితేటలు పెరుగుతాయి. దాంతో అన్ని పనులు సమర్థవంతంగా పూర్తిచేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+