ఈ రాశులపై కనక వర్షం కురిపిస్తున్న శుక్రాచార్యులవారు
రాక్షసులకు గురువైన శుక్రుడు నవగ్రహాల్లో కీలకమైన గ్రహం. సంపదను, ఐశ్వర్యాన్ని, విలాసవంతమైన జీవితాన్ని, అందాన్ని, ఫ్యాషన్ కు కారకుడు. ఈనెల 13వ తేదీన భరణి నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. ఇదే నెల 26వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి అమితమైన లాభాలు సమకూరనున్నాయి. అంతేకాకుండా ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయి. ఆయా రాశుల వివరాలను, వారికి ఎలా కలిసిరానుందనే విషయాలను తెలుసుకుందాం.
మకర రాశి
తండ్రి వైపు నుంచి ఆస్తులు కలిసివస్తాయి. దీనివల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా జీవిస్తారు. సంపాదన పెరుగుతుంది. మీరు పెట్టే పెట్టుబడుల నుంచి మంచి లాభాలను గడిస్తారు. రాబోయే కాలానికి సంబంధించి ఇప్పటినుంచే ప్రణాళికలు వేసుకుంటారు. సహజంగానే ధనం కూడా పెరుగుతూ వస్తుంటుంది.

మీన రాశి
ఈ రాశివారికి వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. వచ్చిన డబ్బును కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడతారు. కుటుంబ పరంగా చాలా సంతోషంగా ఉంటుంది. అందరూ కలిసిమెలిసి ఉంటారు. తీర్థయాత్రలకు వెళతారు. భార్యవైపు నుంచి ఆస్తి కలిసివచ్చే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు.
తులా రాశి
ఈ రాశివారు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఆస్తులను కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. శుక్రుడి నక్షత్ర మార్పు ఈ రాశివారికి అనేక లాభాలను తెచ్చివ్వబోతోంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. మంచి లాభాలను గడిస్తారు. కొత్త మార్గాలద్వారా డబ్బును సంపాదించడానికి మార్గాలు దొరుకుతాయి.
సింహ రాశి
కెరీర్ లో ఇప్పటివరకు సాధించని విజయాన్ని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అన్ని పనుల్లో విజయం అందుకుంటారు. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. వేతనం కూడా పెరుగుతుంది. కొత్త మార్గాలద్వారా డబ్బు సంపాదించడానికి మార్గాలు దొరుకుతాయి.












Click it and Unblock the Notifications