ఫిబ్రవరి వరకు ఈ రాశులకు అతి భయంకరమైన దరిద్రం
జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల్లో కీలక గ్రహమైన కుజుడు ఆనందానికి, శ్రేయస్సుకు, విజయానికి, కీర్తికి కారకుడు. ఆయన అనుకూలంగా ఉంటే సమాజంలో గౌరవం తగ్గడంతోపాటు కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకుంటారు. వ్యాపారంలో, ఉద్యోగంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఈనెల ఏడోతేదీన కర్కాటకంలోకి ప్రవేశించగానే ఈ మార్పులన్నీ చోటుచేసుకుంటాయి. ఫిబ్రవరి వరకు ఈ రాశిలోనే కుజుడు తిరోగమన దిశలోనే సంచారం చేస్తాడు. ఈ సంచారం చాలా రాశులకు హానికరమని పండితులు తెలియజేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ వరకు కర్కాటక రాశిలోనే ఉండటంవల్ల ఏయే రాశులకు కష్టాలు ఎదురవుతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
మేష రాశి
కార్యాలయాల్లో ఉద్యోగులకు సహోద్యోగులతో విభేదాలు తలెత్తుతాయి. ఆరోగ్యం బాగోదు. రావల్సిన డబ్బు కూడా సమయానికి చేతికి అందదు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులు జాగ్రత్తగా ఉండకపోతే నష్టాలు తప్పవు. కుటుంబంలో వాతావరణం బాగోదు. ఉద్రిక్త వాతావరణం తలెత్తుతుంది. పనులన్నీ సకాలంలో పూర్తికావు. విజయాలకు దూరంగా ఉంటారు. ఎందులో చేయి పెట్టినా అపజయమే.

సింహం రాశి
వృత్తితోపాటు ఉద్యోగాల్లో కూడా సమస్యలు ఎదురవుతాయి. ఎల్లప్పుడూ అప్పుల బాధ వెంటాడుతుంటుంది. కుజుడి తిరోగమనం ఈ రాశివారికి చాలా హానికరమని చెప్పొచ్చు. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. ఏ పనీ సకాలంలో పూర్తికాదు.
ధనుస్సు రాశి
ఈ రాశివారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. శారీరకంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటారు. కుటుంబంతోపాటు బయట కూడా చికాకు పరిచే వాతావరణమే ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్త లేకపోతే తీవ్రంగా నష్టపోతారు.
మీన రాశి
ఆర్థికంగా నష్టపోతారు. ఆత్మవిశ్వాసం లోపించి ఏ పనినీ పూర్తిచేయలేరు. ప్రభుత్వ యంత్రాంగానికి నష్టం వాటిల్లుతుంది. వాదనలకు దూరంగా ఉండాలి. చాలావరకు మౌనంగా ఉంటే మంచిది. లేదంటే కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పలు కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications