ఈనెల 15 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం: పండిట్ కల్కిరామ్

నవగ్రహాలకు రాజు అయిన సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తుంటాడు. ఈనెల 15వ తేదీన ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 14వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. ఈ సమయాన్ని ధను సంక్రాంతి అని పిలుస్తారు. ఈ సమయంలో వ్యక్తి జాతకంలో సూర్యుడు శుభస్థానంలో ఉంటే వారికి తిరుగుండదు. జీవితాంతం ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. సూర్యుడు రాశిని మార్చడం అన్ని రాశులను ప్రభావితం చేసినప్పటికీ ప్రధానంగా నాలుగు రాశులవారిపై మాత్రం అధిక ప్రభావం ఉంటుంది. చేసే కర్మలకు మంచి ఫలితాలు వస్తుంటాయి.

మేషం
ఆదాయం పెంచుకోవడానికి అదనపు మార్గాలు తోడవుతాయి. వ్యాపారస్తులకు తమ వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. వ్యాపారాన్ని విస్తరించడంతోపాటు కొత్త పెట్టుబడులు పెడతారు. కెరీర్ పరంగా ఉద్యోగులకు బాగుంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేసుకుంటారు. కొత్త సంవత్సరంలో శుభవార్తను వింటారు.

four zodiac signs will get amazing benefits and huge money due to sun enters to sagittarius in december 15th

మిథునం
దాంపత్య జీవితంలో కొన్నాళ్ల నుంచి ఎదురవుతున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. డబ్బుకు సంబంధించిన కొరత ఉంటే అది ఈ సమయంలో తీరుతుంది. కొత్త కారును కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.

సింహం
విద్యార్థులకు పరీక్షల్లో కోరుకున్నరీతిలో ఫలితాలు వస్తాయి. ఈ రాశివారు ఈ సమయంలో ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రాశివారికి ఆదాయం పెరగడంతోపాటు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను ఈ సమయంలో పూర్తిచేస్తారు. వాటినుంచి మంచి ఆదాయాన్ని అందుకుంటారు.

వృశ్చికం
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఆదాయం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. అలాగే వారికి వేతనం కూడా పెరుగుతుంది. ఆన్ లైన్ సంబంధిత ఉద్యోగాలు చేసేవారికి వేతనాల పెరుగుదల ఉంది. దాంపత్య జీవితం బాగుంటుంది. ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది. డబ్బుకు సంబంధించి ఏ పని తలపెట్టినా విజయం దక్కుతుంది. ఆదాయం వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+