ఈ రాశులకు అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను ప్రసాదించిన బుధుడు

గ్రహాలకు యువరాజు లాంటి బుధుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రస్తుతం బుధుడు సింహ రాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశించాడు. ఆ సమయానికి సూర్యుడు, కేతువు కూడా కన్యారాశిలోనే సంచారం చేస్తున్నాయి. దీనివల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడగా, బుధుడు తన సొంత రాశిలోకి రావడంవల్ల ఇది భద్ర రాజయోగంగా మారుతుంది. ఈ యోగాల కలయిక అన్ని రాశులపై ఉన్నప్పటికీ కొన్నింటికి మాత్రం అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.

కన్యా రాశి
పెండింగ్ లో ఉన్న బకాయిలు ఈ సమయంలోనే వస్తాయి. ధ్యానం చేయడంవల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగంలో మార్పులు జరుగుతుంటాయికాబట్టి అధైర్యపడకుండా ముందుకు పయనించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది.

four zodiac signs will get happy life due to mercury transit virgo

మేష రాశి
దాంపత్య జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇష్టదైవాన్ని పూజించడంవల్ల, దేవాలయాలను సందర్శించడంవల్ల వీటి నుంచి బయటపడతారు. అలాగే తీసుకునే ఆహారం, నిద్రపై ఎంతో శ్రద్ధ ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా కష్టమవుతుంది. శాంతితో సమస్యలను పరిష్కరించుకోవాలి.

ధనుస్సు రాశి
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ అత్యవసర సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ఇతరులతో మాట్లాడే సమయంలో ఎంతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. వృత్తితోపాటు ఉద్యోగంలో కూడా బాధ్యతలు అధికంగా ఉంటాయి.

సింహం రాశి
కెరీర్ పరంగా అనుకున్నవి సాధిస్తారు. మాటతీరు ప్రసన్నంగా ఉండటంవల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఎదురుకావు. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. ఆరోగ్యం పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+