12 ఏళ్ల తర్వాత ఈ రాశులను కోటీశ్వరులను చేస్తోన్న బుధుడు, గురుడు
జ్యోతిష్యం ప్రకారం జూన్ నెల చాలా కీలకం. దేవతల గురువైన బృహస్పతి, గ్రహాల రాకుమారుడైన బుధుడు కలుసుకుంటారు. దీనివల్ల కొన్ని రాశులవారి కెరీర్ చాలా అద్భుతంగా ఉండబోతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. సంపాదన పెరగడంతోపాటు అనేక రకాల ప్రయోజనాలు కలగనున్నాయి. ఏయే రాశులకు ఏవిధంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
సింహరాశి
కోరుకున్న కోరికలన్నీ ఇప్పుడు నెరవేరతాయి. ఆర్థికంగా మంచి ప్రయోజనాలున్నాయి. అన్నివిధాలుగా కలిసిరాబోతోంది. డబ్బును భారీగా పొందుతారు. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు చాలా డబ్బులు ఖర్చుపెడతారు. అది మంచి అలవాటు కాదు. రాబోయే జీవితం కూడా అద్భుతంగా ఉండబోతోంది. ఎదుటివారితో మాత్రం విభేదాలు పెట్టుకోవద్దు.

మీన రాశి
వ్యాపారాలు చేస్తున్నవారికి ఇది మంచి సమయం. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. మంచి లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్థులకు వేరే అవకాశాలతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయి. కొంతకాలం నుంచి వేధిస్తున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కొంతకాలంగా పెండింగ్ లో పడిపోయిన పనులన్నీ ఈ సమయంలోనే పూర్తిచేయగలుగుతారు. అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
మకర రాశి
ఊహించనిరీతిలో ఆర్థిక లాభాలున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం వల్ల డబ్బును ఆదా చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. డబ్బులు పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇది మంచి సమయం. దాంపత్య జీవితంలో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. జీవిత భాగస్వామి సలహాతో చేసిన పనులవల్ల డబ్బులు భారీగా వస్తాయి.
మేష రాశి
కెరీర్ కు సంబంధించి ఊహించనిరీతిలో విజయాలున్నాయి. అదృష్టం తోడుండటంవల్ల అన్నిరకాలుగా కలిసివస్తుంది. ఏ పని తలపెట్టినా ఉద్యోగస్థులకు పై అధికారుల నుంచి సంపూర్ణమైన మద్దతు, సహకారం లభిస్తాయి. ఆదాయం పెరిగి ఆర్థికంగా స్థిరపడతారు. కోరుకున్నచోటకు వెళ్లాలంటే కొంత సమయం పడుతుంది. పెట్టుబడులు పెట్టే సమయంలో కుటుంబ సభ్యులతో చర్చించుకొని, అందరూ ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు మాత్రమే పెట్టాలి. అలాగే పెద్దల సలహా తీసుకోవాలి. సొంత నిర్ణయమైతే నష్టపోయే ప్రమాదం ఉంది.












Click it and Unblock the Notifications