వృషభ రాశిలో వరుణుడి తిరోగమనం.. ఈ రాశులపై లక్ష్మీదేవి వరాల జల్లు
వచ్చే నెల 6వ తేదీన వరుణ దేవుడు మిథున రాశి నుంచి వృషభరాశిలోకి ప్రవేశించి తిరోగమన దిశలో సంచారం చేస్తాడు. వరుణులు ఇలా చేయడంవల్ల నాలుగు రాశులకు అదృష్టం పట్టుకుంటుందని, అమితంగా లాభపడతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ఆర్థిక లాభాలుంటాయని చెబుతున్నారు. ఏయే రాశులకు ఆర్థికంగా కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
మకర రాశి
కొత్తగా అవకాశాలు తలుపు తడతాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి వెళతారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. మీపై మీకున్న నమ్మకమే మీ పెట్టుబడి. కెరీర్ పరంగా కలిసివస్తుంది. ఆర్థికంగా గతంలో కంటే బలపడతారు.

మీన రాశి
ప్రేమలో ఉన్నవారి జీవితం చాలా మధురంగా ఉంటుంది. ఇరువైపులా కుటుంబాల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. జీవితం చాలా సంతోషంగా మారుతుంది. కొత్తగా ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. అందరూ కలిసి విహార యాత్రలకు వెళతారు.
వృషభ రాశి
ఈ రాశివారు సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. అనుకోనిరీతిలో వీరికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారం కూడా బాగా కలిసివస్తుంది. పనిచేసే ప్రదేశంల బారీగా లాభాలుంటాయి. అనుకోని రీతిలో కలిసివస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళతారు.
కన్యా రాశి
ఆర్థికంగా వీరికి బాగా కలిసివస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నష్టపోయే అవకాశం ఉంది. ఈ రాశివారు మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ఆర్థికంగా కలిసివస్తుంది. పెద్దల సలహా మేరకు కొత్త పనులు ప్రారంభించాలి.












Click it and Unblock the Notifications