కొద్ది రోజుల్లోనే ఈ రాశులకు సంపద రాబోతోంది
గురువు అంటే జీవితానికి దారి చూపించేవాడు. జ్ఞాన జ్యోతులు వెలిగించేవాడు. అన అసలైన జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందుకు నడిపిస్తాడు. అందుకు కావల్సింది ఆయనపై అపారమైన నమ్మకం. అది ఉంటే ఈ జీవిత నౌకను చాలా సులువుగా దాటేస్తాం. అటువంటి గురువైన బృహస్పతి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో తిరోగమనంలో సంచారం చేస్తాడు. దీనివల్ల లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.
మిథున రాశి
జీవితం ఆర్థిక లాభదాయకంగా మారుతుంది. డబ్బు ఎక్కువగా వస్తుంది. ఆర్థిక సమస్యలను పరిష్కరించి డబ్బును పొదుపు పచేస్తారు. వ్యాపారంతోపాటు ఉద్యోగంలో కూడా వృద్ధి ఉంది. అనుకున్నది సాధిస్తారు. కుటుంబం సంతోషంగా ఉంటుంది. కొత్తగా ఇంటిని, భూమిని కొనుగోలు చేస్తారు. దీనికి సంబంధించిన యోగం ఈ రాశివారికి ఉంది.

వృశ్చిక రాశి
సమాజంలో సంబంధాలు మెరుగుపడతాయి. మంచి పేరు వస్తుంది. ఓర్పుగా ఉండాలి. పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా లాభాలను తీసుకువచ్చేలా మీ పెట్టుబడులు ఉంటాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. మీ ప్రేమకు పెద్దలు అంగీకరిస్తారు. రుణం ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
తులారాశి
పనిలో విశ్వాసం పెరుగుతుంది. కొత్తగా భూమిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కోరుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. అదృష్టం కలిసివస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపట్ల ఆసక్తి చూపుతారు. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది. ఉద్యోగస్థులకు పదోన్నతి ఉంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నవంబర్ 12న బృహస్పతి తులారాశి 10వ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు.
కన్యా రాశి
ఈ రాశి 11వ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు. పునర్వసు నక్షత్రంలో జరగడంవల్ల అన్నీ శుభ ఫలితాలే ఎదురవుతాయి. పెళ్లికానివారికి పెళ్లితోపాటు డబ్బు లాభం ఉంటుంది. దీర్ఘాకలిక సమస్యల నుంచి డబ్బు వల్ల బయటపడతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని గురువు నింపుతాడు. డబ్బు సంపాదనకు గతంలో ఎన్నడూ లేనంత అవకాశాలను పొందుతారు.












Click it and Unblock the Notifications