ఈనెల 16 నుంచి ఈ రాశులకు ఎదురులేని ధనయోగం
సూర్యుడు జాతకంలో బలంగా ఉంటే అదృష్టం కూడా అధికంగా ఉంటుంది. వ్యక్తి జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలంటే సూర్యుడు శుభస్థానంలో ఉండాలి. ఈనెల 16న సూర్యుడు కర్కాటక రాశి నుంచి తన సొంతరాశి అయిన సింహరాశిలోకి ప్రవేవిస్తున్నాడు. ఈనెల15న రాఖీపౌర్ణమి ఉంది.
అందుకు ఒకరోజు ముందు సింహరాశిలోకి భానుడు సంచారం చేస్తున్నాడు. నెలకోసారి రాశిని మార్చుకుంటూ నవ గ్రహాల్లో తిరోగమన దశలో సంచరించని ఏకైక గ్రహం సూర్యుడు. ఆయన గ్రహాలకు రాజు. అటువంటి సూర్యుడి సంచారంవల్ల కొన్ని రాశులవారు మంచి శుభ ఫలితాలను, ఆర్థిక ఫలితాలను పొందబోతున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.

సింహ రాశి
ఆర్థికంగా ఈ రాశివారికి చాలా బాగుంటుంది. అదృష్టం తోడుండి అన్ని పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి అకస్మాత్తుగా శుభవార్తలను అందుకుంటారు. వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకుంటారు. చేస్తున్న పనిలో విజయం సాధించడంతోపాటు అది పూర్తయిన తర్వాత ఆత్మవిశ్వాసంతో ఇతర పనులను పూర్తిచేసి మంచి పేరును సంపాదిస్తారు.
మిథున రాశి
ఆర్థికంగా పరిస్థితి బలంగా ఉంది. దీనివల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. ఉద్యోగస్తులకు మంచి శుభవార్తలను వినే అవకాశం కనపడుతోంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉండటంతోపాటు అందరిమధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. కొన్ని శుభవార్తలను ఈ సమయంలోనే వింటారు.
ధనుస్సు రాశి
జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన మద్దతు లభించడంవల్ల అన్ని పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగాల్లో ఉన్నవారి వ్యక్తిగత ప్రవర్తన మంచిపేరును తెచ్చిపెడుతుంది. మనసు ఎంతో ప్రశాంతంగా ఉండటంతోపాటు శారీరకంగా కూడా ఆరోగ్యాన్ని కలిగివుంటారు. చేసే పనుల్లో విజయం సాధించడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరంలేదు.
కన్యా రాశి
అధిక సమయాన్ని జీవిత భాగస్వామికి కేటాయిస్తారు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. చేస్తున్న పనిలో ఊహించనిరీతిలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులతోపాటు వ్యాపారస్తులకు కూడా అద్భుతమైన పురోగతి ఉంది. వ్యాపారంలో మంచి అవకాశాలు కనపడుతున్నాయి. కష్టించి విజయాన్ని దక్కించుకుంటారు.












Click it and Unblock the Notifications