సంసప్తక యోగం.. ఈ రాశులకు అఖండ ధనయోగం
ఈనెల 13వ తేదీన శుక్రుడు తులారాశిని వదిలిపెట్టి వృశ్చికంలోకి సంచారం చేశాడు. అదే సమయానికి బృహస్పతి మే నుంచి వృషభరాశిలో సంచారం చేస్తున్నాడు. వృశ్చికంలో శుక్రుడు, వృషభంలో బృహస్పతి తిరోగమన దశలో ఉండటంవల్ల సంసప్తక యోగం ఏర్పడుతోంది. జ్యోతిష్యం ప్రకారం ఇది చాలా శక్తివంతమైన యోగం. దీపావళి రోజు కూడా ఈ యోగం ఉంటుంది. కొన్ని రాశులవారికి విపరీతమైన ప్రయోజనాలను కల్పిస్తుంది. రెండు గ్రహాలు ఒకదాన్నొకటి ఏడో స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ యోగం ఏర్పడుతుంది. నవంబరు ఏడోతేదీన శుక్రుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేస్తాడు. అప్పటివరకు ఈ యోగం ఉంటుంది. తర్వాత అంతమవుతుంది. ఈ సంసప్తక యోగం ఏ రాశులకు శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రాశివారికి అనుకున్న పనులన్నీ నెరవేరతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తారు. వైవాహిక జీవితం కూడా ఎంతో మధురంగా, సంతోషంగా సాగుతుంది. దాంపత్య జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు. ప్రేమ జీవితంతోపాటు వైవాహిక జీవితంలో ఉన్న కలహాలన్నీ దూరమవుతాయి.

వృశ్చికం
సంసప్తక యోగం ఈ రాశులవారికి నవంబరు ఏడోతేదీ వరకు తిరుగులేనివారిగా చేస్తుంది. వీరు ఏ పని తలపెట్టినా విజయం చేకూరుతుంది. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. పూర్తిస్థాయిలో శక్తిసామర్థ్యాలను వినియోగించడంవల్ల మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్థలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకోవడానికి అవకాశాలు తలుపు తడతాయి.
వృషభం
వీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు ఫలితాన్ని సంసప్తక యోగం అందిస్తుంది. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఎదురవుతున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్థలు కూడా తగ్గిపోతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపుతో చేసే పనుల్లో విజయం దక్కి ఆర్థికంగా స్థిరపడతారు. ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఎంతో మర్యాదగా, మృదువుగా మీ మాట ఉండటంవల్ల పనులన్నీ సులువుగా జరిగిపోతాయి.
ధనుస్సు
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులు నవంబరు ఏడోతేదీలోపు పూర్తవుతాయి. అలాగే ఈ సమయంలో ఏ పని తలపెట్టినా విజయాన్ని సాధిస్తారు. మీకున్న తెలివితేటలతో పనులను సులువుగా పూర్తిచేసుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహార యాత్రలకు వెళతారు.












Click it and Unblock the Notifications