ఏప్రిల్ 5న మహా అద్భుతం.. ఈ రాశులకు అఖండ ధనయోగం
ఖగోళంలో కొన్ని కొన్ని సార్లు అద్భుతాలు చోటుచేసుకుంటాయి. గ్రహాలు రాశి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో 120 డిగ్రీల దూరంలో రెండు గ్రహాలు సమానంగా ఉన్నప్పుడు అది చాలా మంచి శుభ సమయమని జ్యోతిష్య పండితులు లెక్క గట్టి చెబుతున్నారు. ఇలాగే ఏప్రిల్ ఐదో తేదీ ఉదయం 6.00 గంటలకు అంగారకుడు 120 డిగ్రీల దూరంలో శనిదేవుడు ఉండబోతున్నాడు. ఈ ప్రభావం అన్న రాశులపై పడుతోంది. అదే రోజు కుజుడు, శని కలయిక ఉంది. దీనివల్ల రాశి చక్ర గుర్తులకు మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
కర్కాటక రాశి
వీరికి మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. విజయాలు కూడా చాలా సులువుగా సాధిస్తారు. అదృష్టం కలిసిరావడంవల్లే ఇలా జరుగుతుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావు.

సింహ రాశి
ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది. వ్యాపారాలు చేసేవారు, ఉద్యోగస్థులు కూడా కొన్ని ముఖ్యమైన శుభకార్యాలకు హాజరుకావాల్సి ఉంటుంది. శనిదేవుడి దయవల్ల ఏ పని తలపెట్టినా పూర్తవుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నింటినీ ఈ సమయంలో పూర్తిచేయగలుగుతారు.
మకర రాశి
ఈ రాశివారు ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు. శని ప్రభావం వల్ల డబ్బు విషయంలో ఇబ్బందులుండవు. ఆర్థికంగా విజయాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుదలతోపాటు పదోన్నతి ఉంది. ముందుగా ప్రణాళికలు రచించుకొని ఉండటంవల్ల కొన్ని విశేషమైన లాభాలను అందుకుంటారు. వీరికి అంతా మంచే జరుగుతుంది.
వృషభ రాశి
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను ఈ సమయంలోనే అందుకుంటారు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. వచ్చిన డబ్బును మంచి పెట్టుబడులవైపు మళ్లిస్తేనే ఉపయోగం. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా బాగుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్యంతోపాటు మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం అవసరం. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఉంటేనే అవి పెద్దవి కాకుండా ఉంటాయి.












Click it and Unblock the Notifications