రేపటి నుంచి ఈ రాశులకు అద్భుతమైన మహర్దశ
అక్టోబరు నెలలో కీలక గ్రహాలు సంచారం చేస్తుంటాయి. ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం రేపు సంభవించబోతోంది. గ్రహాల సంచార ప్రభావం రాశుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కొన్ని రాశులకు మంచి పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశులకు చెడు పరిణామాలు ఎదురవుతుంటాయి. గురువు తిరోగమనంలో ఉండటం, శుక్రుడు, బుధుడు, సూర్యుడు, అంగారకుడు రాశులు మార్చడంవల్ల నాలుగు రాశులకు మాత్రం అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు కలబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అలాగే నాలుగు రాజయోగాలు కూడా ఏర్పడబోతున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
కర్కాటక రాశి
గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. అన్ని పనుల్లో విజయం దక్కడానికి కారణం అదృష్టం తోడుండటంవల్లే. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. జీవితంలో ఎటుచూసినా అంతా సానుకూలంగానే కనిపిస్తుంటుంది. ఆర్థిక ప్రయోజనాలున్నాయి. జీవితం ఒక్కసారిగా మారిపోతుంది.

వృషభ రాశి
నిరుద్యోగులకు, వ్యాపారులకు, ఉద్యోగస్తులకు లాభాలున్నాయి. ఈ రాశివారికి ఒకరకంగా మహర్దశ పట్టనుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వీరు మట్టి పట్టుకున్నా బంగారమే అవుతుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది.
తులా రాశి
ఈ రాశివారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగస్తులకు వారు పనిచేసేచోట గుర్తింపు లభిస్తుంది. అలాగే వేతనం కూడా పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు తోడవుతాయి. ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు.
సింహ రాశి
ఉద్యోగం మారాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. అనుకున్న లక్ష్యాలను త్వరగా పూర్తిచేయగలుగుతారు. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు. ఊహించనిరీతిలో సంపద కలుగుతుంది. ఒకరకంగా ఈ రాశివారిపై కనకవర్షం కురుస్తుంది.












Click it and Unblock the Notifications