అమల రాజయోగంతో ఈ రాశులకు అఖండ సంపద
మే మొదటి వారంలో కీలక గ్రహాలు రాశి సంచారం చేస్తున్నాయి. మే ఒకటో తేదీ గురువారం రావడంతో అన్ని రాశులపై బృహస్పతి ప్రభావం ఉంటోంది. ఈ ప్రభావం వల్లే సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం, సుకర్మ యోగం ఏర్పడుతున్నాయి. ఇదే సమయంలో అత్యంత శుభప్రదమైన అమల రాజయోగం ఏర్పడుతోంది. శుక్రుడు, బుధుడు మీనరాశిలో కలవడంవల్లే ఈ యోగం ఏర్పడటం జరుగుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అమల రాజయోగం ప్రభావం వల్ల కొన్ని రాశి చక్ర గుర్తులకు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.
తులారాశి
ఆర్థికంగా వీరికి చెప్పలేనన్ని లాభాలున్నాయి. విద్యార్థులకు తండ్రి వైపు నుంచి మద్దతు లభిస్తుంది. ఆస్తులు కలిసివస్తాయి. వ్యాపారస్తులకు బాగుంది. భారీ లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా శక్తివంతమైన అమల రాజయోగం ఈ రాశివారికి అనేక లాభాలను కలిగిస్తుంది. వీరు గురువారం నుంచి ఏ పని తలపెట్టినా కలిసివస్తుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. బృహస్పతిని పూజించాలి.

ధనస్సు రాశి
లక్ష్మీదేవి ఆశీస్సులు లభించడంవల్ల వీరికి మంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య బంధం మెరుగుపడుతుంది. అందరూ అన్యోన్యంగా ఉంటారు. విదేశాల్లో చదవు కోసం విద్యార్థులు అవకాశాలు కలిసివస్తాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. అనుకోకుండా భార్యాభర్తల మధ్య సంతోషకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.
మిథునరాశి
మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఇది శుభ సమయం అని చెప్పొచ్చు. అలాగే వ్యాపారస్తులు తమ వ్యాపారాలను విస్తరించడానికి ఇది మంచి సమయం. ఈ రాశివారు ఈరోజు నుంచి ఏ పనిలోనైనా అత్యంత సులువుగా విజయం సాధిస్తారు. అందుకు అదృష్టం తోడుంటుంది. న్యాయ సంబంధిత విషయాల్లో కోర్టుల నుంచి తీర్పు అనుకూలంగా వస్తుంది. ఆర్థికంగా మెరుగవుతారు. ఆస్తి సమస్యలు కూడా తొలగిపోతాయి.
సింహరాశి
సెలూన్, బ్యూటీ, ఫ్యాషన్ రంగాల్లో ఉన్నవారికి అమల రాజయోగం ఎంతో మేలు చేస్తుంది. భారీగా సంపదను పొందుతారు. రాజకీయ రంగంతోపాటు సామాజిక రంగంలో ఉన్నవారికి కూడా ఆర్థిక లాభాలున్నాయి. అంతేకాకుండా సన్నిహితుల నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి వీరు అద్భుతమైన సహకారాన్ని అందుకుంటారు. జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు! -
మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం -
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం ఇంట్లో చపాతీలను లెక్కపెట్టి చేస్తే పరమ దరిద్రం -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..












Click it and Unblock the Notifications