ఈనెల రెండోవారం నుంచి ఈ రాశులవారంతా జమిందారులే

ఈనెలలో మొదటివారం ముగియబోతోంది. త్వరలోనే రెండోవారం ప్రారంభం కాబోతోంది. జ్యోతిష్యం ప్రకారం కొన్ని గ్రహాలు ఫిబ్రవరి నెలలో రాశి సంచారం చేయనున్నాయి. వీటిప్రకారం ఫిబ్రవరి రెండోవారంలో గ్రహాల సంచారంవల్ల ఏయే రాశులవారిపై ఎటువంటి ప్రభావం కలగనుందనే విషయాన్ని తెలుసుకుందాం.

మేష రాశి
వ్యాపారస్తులకు దూర ప్రయాణాలున్నాయి. ఈ సమయంలో చేసే అన్ని పనుల్లో విజయమే లభిస్తుంది. పిల్లల వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి. వారిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు.

from february second week 6 zodiac sign people will face mixed results

వృషభ రాశి
ఉద్యోగాలు చేసేవారికి బాగుంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు ఖర్చులు తగ్గించుకోవాలి. ఆరోగ్యపరంగా దద్దుర్లు, దురదలు, అలర్జీల్లాంటి చర్మ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం.

కర్కాటక రాశి
జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రంగా నష్టపోతారు. వ్యాపారాల్లో ఇబ్బందులున్నాయి. ప్రేమ జీవితంలో కూడా సమస్యలున్నాయి. ఆరోగ్యం బాగోదు. వీటిని దృష్టిలో పెట్టుకొని పలురకాల జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు భగవంతుడి నామస్మరణను విడవకూడదు.

సింహ రాశి
ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఒత్తిడి ఉంది. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమస్య నుంచి దూరంగా వెళ్లకుండా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.

కన్యా రాశి
ఉద్యోగస్తులకు బాగుంటుంది. డబ్బును పొదుపు చేస్తారు. సలహాల ప్రకారం వ్యాపారస్తులు నడుచుకోవాల్సి ఉంటుంది. లేదంటే తీవ్రంగా నష్టపోతారు. ఉద్యోగస్తులకు మంచి ఆఫర్లున్నాయి.

తులారాశి
క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి. దేనికీ భయపడకూడదు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలున్నాయి. కుటుంబ జీవనంలో ఉన్నవారికి మంచి లాభాలున్నాయి. ఆర్థిక పరిస్థితులు అదుపులోకి వస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+