జూన్ 7 నుంచి ఈ రాశులకు దరిద్రం పట్టుకుంటుంది

రహస్య విషయాలకు, ఆధ్యాత్మికతకు, ఒంటరితనానికి కేతువు కారకుడు. నీడ గ్రహమని పేరు. అందరూ చెడు చేస్తాడని భయపడతారుకానీ మనం అన్నీ మంచిపనులు చేస్తే మంచి ఫలితాలనే ఇస్తాడు. వచ్చే నెల ఏడోతేదీన కుజుడు సింహరాశిలోకి సంచారం చేస్తాడు. ఆ సమయానికి కేతువు సింహరాశిలోనే సంచార దశలో ఉంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక కుజకేతు యోగం అని పిలుస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన యోగం. శక్తివంతమైన అగ్ని రాశిగా పేరున్న సింహరాశిలో కేతువు, కుజుడి కలయికవల్ల ఏయే రాశులవారి జీవితాల్లో మార్పులు చోటుచేసుకోబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.

కర్కాటక రాశి
వీరికి మాత్రం సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా సజావుగా సాగుతాయి. పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికంగా చిక్కులు తలెత్తుతాయి. ఏ నిర్ణయం తీసుకున్న పెద్దల సలహాతోపాటు నిపుణుల సలహా కూడా తీసుకోవాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.

From June 7th nothing will happen to these zodiac signs Whatever work you undertake you will face failure due to ketu and mars conjunction in leo

సింహరాశి
అవమానాలు జరుగుతాయి. మానసికంగా ఒత్తిడి ఉంటుంది. గతంలోకంటే బంధువులతో సంబంధాలు ఇంకా క్షీణిస్తాయి. ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులున్నాయి.

వృషభ రాశి
కొందరికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది. మానసికంగా ఇప్పటివరకు ఉన్న ప్రశాంతతను కోల్పోతారు. కుటుంబంలో వాతావరణం మొత్తం అశాంతిగా మారిపోతుంది. భూమికి సంబంధించి, ఇంటికి సంబంధించి వివాదాలు ఏర్పడతాయి. మీ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. అన్నీ అనుకున్నట్లుగా జరగవు.

మేషరాశి
ఉన్నత విద్యకు సంబంధించి అడ్డంకులు ఏర్పడతాయి. ఉద్యోగస్థులకు తోటి ఉద్యోగుల నుంచి అనేక సమస్యలు ఎదురవుతాయి. ప్రేమ జీవితంలో ఉన్నవారు పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లలకు సంబంధించి మీలో ఆందోళన రోజురోజుకు పెరుగుతుంది. ఒకరకంగా ఈ సమయం ఈ రాశివారికి పీడకల లాంటిదని చెప్పొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+