జూన్ 7 నుంచి వీరికి గజకేసరి రాజయోగం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి మార్పు అనేది అన్ని రాశిచక్రాలపై ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో ఒకే రాశిలో రెండు గ్రహాల కలయిక ఉంటుంది. అటువంటి సందర్భంలో రాశిచక్రాలవారికి శుభ, అశుభ యోగాలుంటాయి. ఒకే రాశిలో రెండు లేదంటే అంతకన్నా ఎక్కువగా గ్రహాల కలయిక ఉంటే దాన్ని యుతి అంటారు. ఇవి కూడా కాలానుగుణంగా శుభ యోగాలను, లేదంటే అశుభ యోగాలను ఏర్పరుస్తుంటాయి. అటువంటి రాజయోగం ఒకటి జూన్ 7వ తేదీన ఏర్పడబోతోంది.
జూన్ 7వ తేదీన బుధుడు వృషభరాశిలో సంచరించనున్నాడు. మరోవైపు మకరరాశిలో బృహస్పతి, చంద్రుడి కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన యోగం. కొన్ని రాశులవారికి దీనివల్ల మంచిరోజులు వస్తాయి. ఆ రాశులవారు ఎవరెవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : గజకేసరి రాజయోగం వల్ల ఈ రాశివారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. సంపద, శ్రేయస్సు లభిస్తుంది. కొంతకాలంగా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. పనిచేసే చోట మీ పనికి సహొద్యోగులు, అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతి, బోనస్ చేతికందే అవకాశం కనపడుతోంది. కొత్తవారితో పరిచయమవడం జరుగుతుంది. కోరికలన్నీ నెరవేరతాయి.
మిథున రాశి : బృహస్పతి, చంద్రుడి కలయిక వలన ఏర్పడుతున్న గజకేసరి యోగం మిథునరాశి రాశి వారికి మంచి ఫలితాలనివ్వనుంది. సమాజంలో వీరికి గౌరవం లభిస్తుంది. కీర్తిప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మికంగా ధన లాభం పొందుతారు. అదృష్టం వీరికి తోడుగా నిలుస్తుంది. వ్యక్తిత్వంతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు.
తుల రాశి : గజకేసరి రాజయోగం వీరికి అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవడంతోపాటు ఆకస్మికంగా ధనాన్ని పొందుతారు. వ్యాపార, ఉద్యోగాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విహార యాత్రలు చేస్తారు.












Click it and Unblock the Notifications