15 నుంచి ఈ రాశులవారిపై శనిదేవుడి చల్లని చూపు-పదవి, ధనలాభం
శతభిషా నక్షత్రంలో శని ప్రవేశించినప్పుడు మిథునరాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తాడు.
మార్చి 15 నుంచి అక్టోబర్ 17 వరకు శనిగ్రహం శతభిష నక్షత్రం మొదటి దశలో ఉంటుంది. దీని అధిపతి బృహస్పతి. శని సంచారం 5 రాశుల వారికి విశేష ప్రయోజనాలను చేకూరుస్తుంది. ప్రస్తుతం శని కుంభరాశిలో సంచరిస్తున్నాడు. మార్చి 5న శని శతభిష నక్షత్రంలోకి ప్రవేశించింది. శని గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో నెమ్మదైన గ్రహం అంటారు. శతభిషా నక్షత్రంలోకి వచ్చిన తర్వాత 7 నెలల పాటు శని ఈ నక్షత్రం మొదటి దశలోనే సంచరిస్తుంటాడు.

మేష రాశి :
మేష రాశి వారికి శతభిష నక్షత్రంలో శని సంచారం మేలు చేస్తుంది. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నవారికి ఎక్కువ మేలు చేస్తుంది. శని సంచార సమయంలో కొత్త పనులను చేపటవచ్చు. ఈ కాలం మేష రాశికి చెందిన వ్యాపారవేత్తలకు ఉపయోగంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పదవులు, ప్రతిష్టలతో పాటు ధనలాభం కూడా కలుగుతుంది.

మిథున రాశి :
శతభిషా నక్షత్రంలో శని ప్రవేశించినప్పుడు మిథునరాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తాడు. రెండున్నర సంవత్సరాలుగా పోరాడుతున్నవారికి శుభఫలితాలను ఇస్తాడు. ఈ కాలంలో శని మిథునం నుంచి 9వ ఇంట్లో ఉంటాడు. ఈ కాలంలో, మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం, లేదంటే దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రయాణం విజయవంతంగా, ఉద్దేశపూర్వకంగా ఉండటంతోపాటు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించే విద్యార్థులు తమ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు.

సింహ రాశి :
సింహ రాశి వారి కెరీర్ పరంగా చాలా ఉన్నతంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు విజయాలను సాధించడమే కాకుండా బదిలీలను కోరుకుంటే ఉద్యోగులకు వారి కోరిక నెరవేరుతుంది. ఏదైనా కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే, ఈ సమయంలో మీరు సానుకూల ఫలితాలను పొందడమే కాకుండా ఆర్థిక విషయాల్లో శని సంచారం లాభదాయకంగా ఉండటంతోపాటు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.

తుల రాశి :
శతభిష నక్షత్రంలో శని సంచారం తుల రాశి వారికి చాలా బాగుంటుంది. ఈ సమయంలో కెరీర్‌లో ఆహ్లాదకరమైన, అనుకూలమైన ఫలితాలను పొందటమే కాకుండా సొంతంగా ఏ పని తలపెట్టినా విపరీతమైన డబ్బు వస్తుంది. అయితే ఈ డబ్బు మీతో తప్పులు చేయించే అవకాశం ఉంటుంది. లాభం కోసం తప్పుడు మార్గంలో నడవకుండా ఉండాలి. శని దేవుడు న్యాయమూర్తి. తప్పుడు పద్ధతిని అవలంబించడం వల్ల మీకు లాభం ఉండదు. శతభిష నక్షత్రంలో శని సంచారం ఈ రాశి విద్యార్థులకు చాలా ఫలవంతంగా ఉంటుంది. మీ కృషికి తగ్గ ఫలితాలను పొందడటమే కాకుండా పోటీల్లో కూడా మంచి పనితీరు కనపరుస్తారు.

ధనస్సు రాశి :
ఈ రాశి వారికి శనిగ్రహ సంచారం శతభిష నక్షత్రంలో విజయాన్ని చేకూరుస్తుంది. గణనీయమైన లాభాలను పొందే అవకాశం ఉండటంతోపాటు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న ఈ రాశి వారు కోరుకున్న ఉద్యోగం పొందవచ్చు. వ్యాపారవేత్తలకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు రావడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది.












Click it and Unblock the Notifications