నవంబర్ 19 నుండి వీరికి అన్నీ శుభవార్తలే.. ఖాయం చేసిన సూర్యుడు!
జ్యోతిష్య శాస్త్రంలో నవంబర్ మాసంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది . వేద క్యాలెండర్ ప్రకారం గ్రహాల రాజు అయిన సూర్యుడు నవంబర్ 19వ తేదీన తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. సూర్యుడు విశాఖ నక్షత్రం నుండి నవంబర్ 19వ తేదీన అనురాధ నక్షత్రం లోకి సంచరించబోతున్నాడు.
అనురాధ నక్షత్రంలోకి సూర్యుడు
అనురాధ నక్షత్రం లోనే సూర్యుడు డిసెంబర్ 2 వరకు ఉంటాడు. ఈ సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. అనురాధ నక్షత్రం శని దేవుడి నక్షత్రం కావడంతో, 30 సంవత్సరాల తర్వాత ఇందులో సూర్య సంచారం జరుగుతుండటంతో అదృష్టవంతులు అయ్యే ఆ రాశులను గురించి తెలుసుకుందాం.

మిధున రాశి
సూర్యుని నక్షత్ర మార్పు మిధున రాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మిధున రాశి వారు ఏ పని చేసినా కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కొత్త అవకాశాలను కనుగొంటారు. మిధున రాశి వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. మిధున రాశి వారికి తండ్రితో సంబంధం బాగుపడుతుంది. ఇది వీరికి అదృష్ట సమయం.
తులారాశి
తులా రాశి జాతకులకు సూర్యుని నక్షత్రం మార్పు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో తులా రాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఇది వీరికి ఆర్థికంగా అనుకూలతను ఇస్తుంది. తులారాశి జాతకులు కెరీర్లో విజయాలను సాధిస్తారు. ఉద్యోగం చేసే వారు ఊహించని లాభాలను పొందుతారు. ఆర్థిక లాభాల కోసం కొత్త మార్గాలు ఉద్భవిస్తాయి. తులారాశి జాతకులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం.
మకర రాశి
మకర రాశి జాతకులకు సూర్యుని నక్షత్ర మార్పు కలిసి వస్తుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు. వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందుతారు. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడానికి మీ తెలివితేటలు ఈ సమయంలో పనికి వస్తాయి. ఉద్యోగస్తులు పనిలో కొత్త బాధ్యతలను చూస్తారు. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది అన్ని విధాలా మీకు మంచిని చేకూరుస్తుంది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications