అక్టోబర్ 3నుండి ఈ రాషులవారు మట్టి ముట్టుకున్నా బంగారమే!
జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శని క్రమశిక్షణ నేర్పే దేవుడు. కర్మలకు అధిపతి. అటువంటి శని దేవుడు న్యాయ దేవతగా కూడా గుర్తించబడ్డాడు. శని దేవుడు చాలా నిదానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారతాడు. ఇక శని సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది.
పూర్వాభాద్ర నక్షత్రంలోకి శనిదేవుడు
అక్టోబర్ 3వ తేదీన శనిదేవుడు పూర్వభద్ర నక్షత్రం లోకి సంచరిస్తున్నాడు. పూర్వభద్ర నక్షత్రానికి బృహస్పతి అధిపతి .శని నక్షత్రం మార్పు కొన్ని రాశుల వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. మరి శని నక్షత్ర మార్పుతో అదృష్టాన్ని పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
దీపావళికి ముందు శని కారణంగా మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. మిధున రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసిన ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఉద్యోగాలు చేసేవారు కెరీర్లో విజయాలను సాధిస్తారు. వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. మిధున రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో బలపడుతుంది, కానీ ఆరోగ్య విషయంలో మిధున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి
దీపావళికి ముందు శని నక్షత్ర సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు ఏ పని చేసిన ప్రయోజనకరంగా ఉంటుంది. తల్లితో సమయం గడపడం శుభప్రదంగా ఉంటుంది .ఈ సమయం విద్యార్థులకు చాలా మంచిది. వృషభ రాశి వారికి చదువు పైన ఆసక్తి కలుగుతుంది. ఏ పెద్ద విషయం వృషభ రాశి వారికి ఈ సమయంలో హాని కలిగించదు.
మకర రాశి
మకర రాశి వారు దీపావళికి ముందు శని నక్షత్ర సంచారంతో లాభాలు పొందుతారు. ఇది మకరరాశి వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. వ్యాపారంలో మరింత గణనీయమైన లాభాలు సాధించడానికి మంచి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. విద్యార్థులు చదువు పైన దృష్టి పెట్టాలి. ఈ సమయంలో మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. మానసిక ఒత్తిడి కలుగుతుంది. స్నేహితుల ద్వారా దీని నుండి ఉపశమనం పొందాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications