సెప్టెంబర్ 27 నుండి ఈ రాశులవారు ఏనుగు కుంభస్థలం బద్దలు కొడతారు!
గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ప్రతినెల ఒక రోజు నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు. ఇది సమయంలో సూర్యుడు నక్షత్రాన్ని కూడా మారుస్తూ సంచరిస్తూ ఉంటాడు. దృక్ పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 27వ తేదీన ఉదయం 7 గంటల 14 నిమిషాలకు సూర్యుడు హస్త నక్షత్రం లోకి ప్రవేశిస్తున్నాడు. హస్తా నక్షత్రంలో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. సూర్యుడు అక్టోబర్ 10వ తేదీ వరకు హస్తా నక్షత్రం లోని సంచరిస్తాడు. ఈ సమయంలో అదృష్టం కలిసి వచ్చే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి జాతకులకు సూర్య సంచారం కలిసి వస్తుంది. హస్తా నక్షత్రం లో సూర్య సంచారం కారణంగా మేష రాశి వారు ఈ సమయంలో ఏ పని చేసిన సానుకూల ఫలితం ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ యోగం ఉంది. వివాహితులు సంతోషంగా జీవిస్తారు. సూర్యుని అనుగ్రహంతో ఈ రాశి వారు మానసిక ప్రశాంతతను పొందుతారు. చివరి ఆరోగ్యం ఈ సమయంలో బాగుంటుంది.

తులారాశి
తులారాశి జాతకులకు సూర్య సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. తులారాశి జాతకులు వ్యాపారాలు చేస్తే లాభాలను పొందుతారు. ఈ సమయంలో వీరి ఆదాయం బాగా పెరుగుతుంది పెళ్లయిన వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు. ఎప్పటినుంచో తులా రాశి వారి జీవితంలో ఉన్న టెన్షన్లు అన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఇది తులా రాశి వారికి అదృష్ట కాలం.
మీన రాశి
మీనరాశి జాతకులు సూర్య సంచారం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీన రాశి వారు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం విద్యార్థులు చదువు పైన ఎక్కువ శ్రద్ధ పెడతారు. పెళ్ళికాని వారికి జీవిత భాగస్వామి దొరుకుతుంది. ఈ సమయంలో మీన రాశి వారు ఏ పని చేసిన మెరుగైన ప్రయోజనాలను పొందుతారు. ఇది మీన రాశి వారికి సకల శుభాలను ఇచ్చే కాలం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications