నేటినుండి వీరు పట్టిందల్లా బంగారం.. శాసనం చేసిన బుధ కుజులు!
జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక విశిష్టత ఉంటుంది .జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని ధైర్యానికి శక్తికి కారకుడిగా చెబుతారు. కుజుడు మేష మరియు వృశ్చిక రాశులకు అధిపతిగా చెబుతారు. అక్టోబర్ 27వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల 2. 43 నిమిషాలకు కుజుడు తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించాడు.
బుధ కుజుల సంయోగంతో లబ్ది పొందే రాశులు
అప్పటికే వృశ్చిక రాశిలో బుధుడు సంచారం చేస్తున్నాడు. దీంతో బుధ కుజుల కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఆ రాశుల వారు కొన్ని లాభాలను, విశేషమైన యోగాలను పొందుతారు. బుధ కుజుల సంయోగంతో లబ్ది పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు కుజ, బుధుల సంయోగం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు కొత్త అవకాశాలను పొందుతారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా జీవిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి జాతకులు కెరీర్ లో సానుకూల మార్పులను చూస్తారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు సానుకూల శక్తితో ముందుకు సాగుతారు. ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగాలు చేసే వారికి కలిసి వస్తుంది. అనుకున్న పనులను పూర్తి చేయడంతో పాటు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో మంచి నిర్ణయాలను తీసుకుంటారు.
మకర రాశి
మకర రాశి వారికి బుధ కుజుల సంయోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మకర రాశి జాతకులు సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా మకర రాశి వారికి బాగుంటుంది. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
మీన రాశి
మీనరాశి జాతకులకు బుధ కుజుల సంయోగం కారణంగా కలిసి వస్తుంది. ఈ రెండు గ్రహాల సంయోగంతో ఈ రాశి వారు సంతోషంగా జీవిస్తారు. ఈ సమయంలో మీన రాశి వారి కోసం కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఏ పని చేసిన ఇప్పుడు కలిసి వస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగాలు చేసే వారికి సానుకూలతలు కనిపిస్తాయి.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications