నేటినుండి బుధ కటాక్షంతో ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి కోటీశ్వరులయ్యే రాశులివే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతిగ్రహం ఒక రాశి నుంచి మరకరాశిలోకి సంచారం చేస్తుంది. అంతేకాదు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రం లోకి కూడా సంచారం చేస్తుంది. ప్రతి గ్రహం నిర్దిష్ట కాలం తర్వాత చేసే సంచారం అన్ని రాశుల వారి జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది.
బుధ నక్షత్ర సంచారం
ఇక గ్రహాల రాకుమారుడుగా చెప్పుకునే బుధుడు తరచుగా తన రాశిని మారుస్తూ ఉంటాడు. బుధుడు తెలివితేటలు, తాత్విక సామర్థ్యానికి, వ్యాపారాన్ని అనుగ్రహించే గ్రహంగా చెబుతారు.
అటువంటి బుధుడు ఈరోజు ఉదయం రాహు నక్షత్రమైన శతభిషా నక్షత్రంలో సంచారాన్ని ప్రారంభించాడు. శతభిషా నక్షత్రంలో బుధ సంచారం కొన్ని రాశుల వారి జీవితంలో అదృష్టానికి కారణం అవుతుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేష రాశి
బుధ గ్రహం రాహు నక్షత్రమైన శతభిషా నక్షత్రంలో ప్రవేశించడం కారణంగా మేష రాశి వారికి చాలా ప్రయోజనాలు వస్తాయి. మేష రాశి వారు బంధువులు మరియు స్నేహితుల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు కుటుంబ జీవితంలో పెద్ద మార్పులకు లోనవుతారు. ఈ సమయంలో మేష రాశి వారు పురోగతిని సాధిస్తారు. ఎవరితోనైనా ఎటువంటి వివాదాలు ఉన్న మేష రాశి వారు ఈ సమయంలో పరిష్కరించుకుంటారు.
మిధున రాశి
మిధున రాశి వారికి అధిపతి బుధుడు. బుధుడు రాహు నక్షత్రం లోకి ప్రవేశించడం వల్ల మిధున రాశి వారు కెరీర్లో ఆకస్మిక సానుకూల మార్పులను అనుభవిస్తారు. ఈ సమయంలో మిధున రాశి వారి పనిని పలువురు ప్రశంసిస్తారు. సంపద పెరిగే అవకాశం ఉంది. సామాజికంగానూ గుర్తింపు పొందుతారు. తల్లితండ్రులతో మంచి సమయాన్ని గడుపుతారు. మిధున రాశి వారి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. స్నేహితులతో మంచి సంబంధాలు ఉంటాయి.
తులారాశి
బుధుడు శతభిషా నక్షత్రం లోకి సంచారం చేయడం వల్ల తులా రాశి వారికి జీవితం సానుకూలంగా ఉంటుంది. తులా రాశి జాతకులు ఈ సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తులా రాశిలో జన్మించిన వ్యక్తులు అనేక శుభయోగాలను పొందుతారు. ఆర్థికంగా ఈ సమయం తులా రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆందోళన కలిగించే విషయాలు సానుకూల ఫలితాలను ఇవ్వడం ఈ సమయంలో ప్రధానంగా కనిపిస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications